Home » Case
మదురై జిల్లా తిరుప్పరంకుండ్రం వ్యవహారంలో మత ఘర్షణలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన బీజేపీ సీనియర్ నేత హెచ్.రాజా(Senior BJP leader H. Raja)పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Patanjali Case: యోగా గురువు బాబా రాందేవ్‌పై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఏ కేసులో ఆయనకు వారెంట్ ఇచ్చారు? అసలు ఆయన చేసిన తప్పు ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైకోర్టు జడ్జీలు సహా ప్రతిపక్ష నేతలు, ఇతర ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేసిన వ్యవహారంలో నిందితులుగా ఉన్న పోలీసు అధికారులు భుజంగరావు (అడిషనల్ ఎస్పీ), రాధాకిషన్‌రావు (టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ)లకు గురువారం హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం భూ ఆక్రమణలపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దీనిపై పూర్తిస్థాయి విచారణకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఈ ఘటనపై స్పందించారు. అటవీ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడారు.
ఓ హనీ ట్రాప్ కేసులో తనను కావాలనే ఇరికించారని, అంతేకాకుండా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఫ్యాకల్టీ విధుల నుంచి తనను తొలగించారంటూ ఐఐఎస్సీ మాజీ ప్రొఫెసర్ దుర్గప్ప ఫిర్యాదు చేశారు. దీంతో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాల కృష్ణన్, మరో 16 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదైంది.
రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడు తులసిబాబును ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ సోమవారం రాత్రి విచారించారు. ప్రధానంగా మాజీ సీఐడి చీఫ్ సునీల్ కుమార్‌తో ఉన్న సంబంధాలపై ఆరా తీశారు. అయితే సమయం ఎక్కవగా లేకపోవడంతో గంటన్నర మాత్రమే విచారించారు. తిరిగి మంగళవారం ఉదయం విచారణ కొనసాగనుంది.
నాటి ఎంపీ, ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడు కామేపల్లి తులసి బాబును గుంటూరు కోర్టు మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో సోమవారం నుంచి ఎస్పీ దామోదర్ ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో తులసి బాబును విచారించనున్నారు.
ఆర్జీకర్ కేసులో సీల్దా కోర్టు సోమవారంనాడు కీలక తీర్పు చెబుతూ, సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు విధిస్తున్నట్టు ప్రకటించింది. బాధితురాలి కుటుంబానికి రూ.17 లక్షలు పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణలో సీఐడీ అధికారులు సాంకేతిక ఆధారాలతో ముందుకెళ్తున్నారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణరావు ఇద్దరినీ రాష్ట్రానికి రప్పించేందుకు హైదరాబాద్ పోలీసులు ‘నేరస్తుల అప్పగింత’ అస్త్రంను ప్రయోగించనున్నారు.
దేశంతో పోరాటం సాగిస్తున్నామని ప్రకటించడం ద్వారా నిందితుడు ఉద్దేశపూర్వకంగానే విచ్ఛిన్నకర శక్తులను, ప్రజలపై తిరుగుబాటు చర్యలను రెచ్చగొట్టినట్టు ఫిర్యాదుదారు ఆరోపించారు. వరుస వైఫల్యాలతో నైరాశ్యంతోనే రాహుల్ ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దిగారన్నారు.