Share News

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితులకు బెయిల్‌

ABN , Publish Date - Jan 31 , 2025 | 03:32 AM

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో హైకోర్టు జడ్జీలు సహా ప్రతిపక్ష నేతలు, ఇతర ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్‌ చేసిన వ్యవహారంలో నిందితులుగా ఉన్న పోలీసు అధికారులు భుజంగరావు (అడిషనల్‌ ఎస్పీ), రాధాకిషన్‌రావు (టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ)లకు గురువారం హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితులకు బెయిల్‌

  • భుజంగరావు, రాధాకిషన్‌రావులకు షరతులతో మంజూరు చేసిన హైకోర్టు

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో హైకోర్టు జడ్జీలు సహా ప్రతిపక్ష నేతలు, ఇతర ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్‌ చేసిన వ్యవహారంలో నిందితులుగా ఉన్న పోలీసు అధికారులు భుజంగరావు (అడిషనల్‌ ఎస్పీ), రాధాకిషన్‌రావు (టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ)లకు గురువారం హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. మరో పోలీసు అధికారి తిరుపతన్న (అడిషనల్‌ ఎస్పీ)కు ఇటీవలే సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసిన నేపథ్యంలో ఈ ఇద్దరు అధికారులకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.


రూ.లక్ష చొప్పున రెండు ధరావతులు చెల్లించాలని, విదేశాలకు వెళ్లకుండా పాస్‌పోర్ట్‌లు ట్రయల్‌ కోర్టులో సమర్పించాలని స్పష్టంచేసింది. పోలీసులు ఎప్పుడు పిలిచినా దర్యాప్తునకు సహకరించాలని పేర్కొంది. ఇప్పటికే రాధాకిషన్‌రావు అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్‌పై బయట ఉన్నారు. భుజంగరావు జైలు నుంచి విడుదల కానున్నారు.


ఇదీ చదవండి:

నాలుగో టీ20.. టీమిండియాకు సూపర్ న్యూస్.. మహాబలుడు వచ్చేస్తున్నాడు

కోహ్లీని భయపెట్టిన ఉపేంద్ర.. సొంతగడ్డపై అంతా చూస్తుండగానే..

ఎప్పుడూ చూడని రనౌట్.. ఇంతకంటే దురదృష్టవంతుడు ఉండడు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 31 , 2025 | 03:32 AM