Waqf Bill 2025: వక్ఫ్ బిల్లుకు ఆమోదం.. మోదీ-షా స్కెచ్ వేస్తే ఇట్లుంటది
ABN , Publish Date - Apr 04 , 2025 | 01:20 PM
Waqf Bill Voting: ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అనుకున్నది సాధించింది. వక్ఫ్ బిల్లును తీసుకురావాలని డిసైడ్ అయిన కేంద్ర సర్కార్.. ఎట్టకేలకు బిల్లుకు ఆమోదముద్ర వేయించుకుంది.

మోడీ సర్కారు అనుకున్నది సాధించింది. అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వివాదాలకు దారితీసిన వక్ఫ్ (సవరణ) బిల్లు-2025పై ఎట్టకేలకు ఆమోదముద్ర వేయించుకుంది. ఈ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందింది. రాజ్యసభలో గురువారం అర్ధరాత్రి దాటే వరకు దీని మీద ఫుల్ డిస్కషన్ నడిచింది. విమర్శలు, ప్రతి విమర్శలతో సభ దద్దరిల్లింది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు జవాబుల తర్వాత సవరణల వారీగా ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు మద్దతుగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది సభ్యులు ఓటు వేశారు. అదే లోక్‌సభలో బిల్లుకు అనుకూలంగా 288, వ్యతిరేకంగా 232 ఓట్లు వచ్చాయి.
12 గంటల పాటు అక్కడే..
దేశవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీసిన వక్ఫ్ బిల్లు ఆమోదంతో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. వీళ్లు ఘటికులని.. అనుకున్నది సాధించే వరకు అస్సలు విశ్రమించరని పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్ మెచ్చుకుంటున్నారు. రాజ్యసభలో బిల్లు వీగిపోకుండా ఉండేందుకు బిజూ జనతాదళ్ (బీజేడీ)ను ఒప్పించడం అదుర్స్ అని అంటున్నారు. 12 గంటల పాటు ఉభయ సభలకు అమిత్ షా హాజరై.. ప్రతిదీ ప్లాన్ ప్రకారం జరిగేలా చూసుకోవడం బాగుందని చెబుతున్నారు. ఎన్‌డీఏ సభ్యులతో పాటు ఇతర పార్టీల ఎంపీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించడం, బీజేడీ సభ్యులను దారికి తెచ్చుకోవడం, ఏకబిగిన పార్లమెంట్‌లోనే కూర్చొని బిల్లుకు ఆమోదముద్ర పడేవరకు పక్కకు జరగకపోవడం, విపక్షాల ప్లాన్స్‌ను తిప్పికొట్టడం.. ఇదంతా షా వ్యూహాలకు తిరుగులేదని మరోమారు రుజువు చేసిందని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ప్రధాని మోదీ థాయ్‌లాండ్ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈ తరుణంలో ఉభయ సభల్లో షా అంతా తానై నడిపించారు. మొదట అనుకున్న ప్లాన్ ప్రకారం వక్ఫ్ బిల్లును పక్కా స్కెచ్‌తో ఆమోదించుకోవడం హైలైట్ అని మెచ్చుకుంటున్నారు.
ఇవీ చదవండి:
భార్య రీల్స్ పిచ్చి.. భర్త ఉద్యోగం ఊస్ట్
చెన్నైలో కార్ల్ మార్క్స్ విగ్రహం
పెళ్లై పాతికేళ్లు.. కానీ వివాహం రోజే..
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి