Share News

Indian Border Developmentసరిహద్దు ప్రజలు దేశ భద్రతకు కళ్లూ చెవులు

ABN , Publish Date - Apr 05 , 2025 | 04:25 AM

కేంద్రం సరిహద్దు గ్రామాలను దేశ భద్రతకు కళ్లు, చెవులుగా అభివర్ణిస్తూ 6,839 కోట్ల వ్యయంతో అభివృద్ధి పథకాన్ని ఆమోదించింది. రైల్వే విస్తరణ కోసం 18,658 కోట్ల వ్యయంతో కొత్త ప్రాజెక్టులను ఆమోదించింది.

Indian Border Developmentసరిహద్దు ప్రజలు దేశ భద్రతకు కళ్లూ చెవులు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 4: దేశ సరిహద్దుల్లో ఉన్న గ్రామాల ప్రజలను.. సరిహద్దు భద్రతా బలగాల కళ్లు, చెవులుగా కేంద్రప్రభుత్వం అభివర్ణించింది. ఆయా గ్రామాల అభివృద్ధికి సంబంధించిన ‘ఉజ్వల గ్రామాల పథకం’ రెండో దశకు ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర క్యాబినెట్‌ శుక్రవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. దీంట్లో భాగంగా రూ.6,839 కోట్ల వ్యయంతో అరుణాచల్‌ ప్రదేశ్‌, అస్సాం, బిహార్‌, గుజరాత్‌, జమ్ముకశ్మీర్‌, లఢక్‌, మణిపూర్‌, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లోని సరిహద్దు గ్రామాల్లో 2028-29 వరకు అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టనున్నారు. మరోవైపు మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ లో రైల్వేల విస్తరణకు రూ.18,658 కోట్ల వ్యయంతో చేపట్టే నాలుగు ప్రాజెక్టులను కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ ఆమోదించింది. వీటి ద్వారా దేశంలో రైల్వేమార్గం మరో 1,247 కి.మీ.ల మేర పెరగనుంది.


ఇవి కూడా చదవండి..

Waqf Bill: వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ పిటిషన్

NEET Row: స్టాలిన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. నీట్ వ్యతిరేక బిల్లును నిరాకరించిన రాష్ట్రపతి

PM Modi: భద్రతా వలయంలో రామేశ్వరం..

For National News And Telugu News

Updated Date - Apr 05 , 2025 | 04:25 AM