Home » Chandra Babu
ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉండగా.. వైసీపీ తన అధికారాన్ని ఉపయోగించి విపక్షాలపై కక్షసాధింపులకు పాల్పడుతుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా పోలింగ్‌కు వారం రోజుల ముందు టీడీపీ అధినేత నారా చంద్రబాబు, యువనేత లోకేష్‌పై కేసు పెట్టడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అధికారం ఉందనే అహంకారం, తాను ఏం చేసినా చెల్లుతుందన్నట్లు వైసీపీ అధినేత జగన్ వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గుంతకల్లు నియోజకవర్గంలో తన విజయం తథ్యమని, ఆలూరుకు మించిన భారీ విజయాన్ని అందుకుంటానని టీడీపీ కూటమి అభ్యర్థి గుమ్మనూరు జయరాం ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. ఆ వివరాలు. - నియోజకవర్గ సమస్యలపై అవగాహన ఉందా? ఎలా పరిష్కరిస్తారు..? జయరాం: ఎక్కడి సమస్యలను పరిష్కరించాలన్నా ...
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదివారం అనంతపురం నగరానికి వస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని సప్తగిరి సర్కిల్లో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభకు హాజరవుతారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఆదివారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకూ నిర్వహించే ఎన్నికల బహిరంగ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమితషాతో కలిసి చంద్రబాబు ...
ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిదే గెలiపు అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ నారా చంద్రబాబు నాయుడు పలు అసక్తికర అంశాలు తెలిపారు.
గన్నవరం కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు బాపులపాడు మండలం తేంపల్లి, కొయ్యూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెంపల్లి గ్రామస్తులు యార్లగడ్డ వెంకట్రావుకు జేసీబీలతో స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లలో పెకిలించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజల్లోనూ మార్పునకు నాంది పలుకుతోంది. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి విడుదల చేసిన ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో, కూటమి మేనిఫెస్టోను ప్రజలు బేరీజు వేసుకుంటుండటమే ఇందుకు ప్రధాన కారణం. ఐదేళ్ల వైసీపీ పాలనలో నవరత్నాల పేరుతో అరకొర లబ్ధి చేకూర్చడం మినహా... అభివృద్ధిని పూర్తిస్థాయిలో విస్మరించారనే అన్ని వర్గాల ప్రజలు జగన ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. గడిచిన ఐదేళ్లలో అమలు పరిచిన
వరుసగా రెండో సారి అధికారం అందుకోవడం కోసం వైసీపీ అంది వచ్చిన ప్రతి చిన్న అంశాన్ని తనకు అనుకూలంగా మలుచుకొనేందుకు ప్రయత్నిస్తుంది. ఆ క్రమంలో పెన్షన్లు చేతికి అందక అధిక సంఖ్యలో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఎన్నికల వేళ.. లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో నగదును అధికారులు జమ చేశారు.
గుంటూరు లోక్ సభ తెలుగుదేశం అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తన పార్లమెంట్ పరిధిలో విసృతంగా ప్రచారం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ అంటే తనకు అభిమానం అని, ఆయన మాదిరిగా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. పనిలో పనిగా సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. ప్రధాని రెండు రోజుల పాటు రాష్ట్రంలో ప్రచారం చేయనున్నారు. ఈనెల 6, 8 తేదీలలో ప్రధాని మోదీ, టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల ఉమ్మడి ప్రచార సభలు నిర్వహించనున్నారు. ఈనెల 6వ తేదీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు మధ్యాహ్నం మూడు గంటలకు చేరుకోనున్నారు.
పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ గెలవడని ముద్రగడ పద్మనాభం ఛాలెంజ్ చేశారు. ఒకవేళ పవన్ కల్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని ప్రకటించారు. ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని వివరించారు. ఆ అంశంపై వర్మ స్పందిస్తూ.. ఎన్నికల వరకు ఎందుకు ఇప్పుడే సిద్ధంగా ఉండు అని ప్రతి సవాల్ విసిరారు.