Home » Chittoor
పెళ్లకూరు మండలం చిల్లకూరులోని ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్, వైసీపీ నేత కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి ఇంటిపై దాడికి యత్నించారు.
సత్యవేడు మండల పరిధిలోని శ్రీసిటీ గ్రామాల్లో రెండు రోజులుగా రెవెన్యూ అధికారులు చేపడుతున్న భూముల సర్వే కలకలం రేగుతోంది.
పులిచెర్ల మండలంలో పంటలపై ఏనుగుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పాతపేట పంచాయతీ పూరేడువాండ్లపల్లె, బోడిరెడ్డిగారిపల్లె పంచాయతీ ఆవులపెద్దిరెడ్డిగారిపల్లె వద్ద ఆదివారం వేకువజామున ఏనుగుల గుంపు పంటలను ధ్వంసం చేయడంతో అపారనష్టం వాటిల్లింది.
వైసీపీకి చెందిన చిత్తూరు ఎమ్మెల్సీ కేజేఆర్ భరత్ ఎన్నికల తర్వాత కుప్పంలో కనిపించక పోవడంపై ఆ పార్టీ కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు.
పుంగనూరు మండలం నేతిగుట్లపల్లె ప్రాజెక్టు ముంపు భూములకు పరిహారం ఇప్పించాలని పుంగనూరులో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డికి బాధిత రైతులు, ఎన్డీఏ కూటమి నేతలు విన్నవించాలని వెళ్లినపుడు జరిగిన దాడి కేసులో నలుగురు వైసీపీ కార్యకర్తలను అరెస్టు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు.
రాజకీయాలకు అతీతంగా ఉన్నత విద్యను కూటమి ప్రభుత్వం అందిస్తుందని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. ఆదివారం ద్రావిడ విశ్వవిద్యాలయం 27వ వ్యవస్థాపక దినోత్సవం అక్కడి ఆడిటోరియంలో ఘనంగా జరిగిరది.
గత ఐదేళ్ళూ ఉమ్మడి చిత్తూరు జిల్లావ్యాప్తంగా వైసీపీ నేతలను మొక్కవోని స్థైర్యంతో ఎదుర్కొన్న టీడీపీ(TDP) శ్రేణులు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో పెద్ద ఎత్తున సంబరపడ్డాయి. అయితే వంద రోజులు కూడా గడవక మునుపే శ్రేణులు నిరుత్సాహానికి లోనయ్యాయి.
చిత్తూరు జిల్లా దేవళంపేట, అయ్యవాండ్లపల్లె, ఎర్రపాపిరెడ్డిపల్లె ప్రాంతాల్లో ఏనుగులు సంచారం పెరిగిపోయింది. తరచూ పంటపొలాలపై దాడులు చేస్తూ నాశనం చేస్తు్న్నాయి. కడుపునిండా తినడం, మిగిలిన పంట తొక్కి నాశనం చేస్తూ రైతులకు క్షోభ మిగిల్చుతున్నాయి.
వైసీపీ పాలనలో పంచాయతీలకు పైసా విదల్చకపోగా.. కేంద్రం నుంచి వచ్చిన నిధులను సైతం పక్కదారి పట్టించడంతో పల్లెల ప్రగతి మరుగున పడిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చి గ్రామాల్లో అభివృద్ధి వెలుగులు నింపేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
మద్యం దుకాణాలకు దరఖాస్తుల పర్వం ముగిసింది. 104 మద్యం దుకాణాలకు 2241 దరఖాస్తులు రాగా ప్రభుత్వానికి రూ.44.82 కోట్ల ఆదాయం వచ్చింది.