Home » CID
ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి పై సీఐడీ కేసు నమోదు చేసింది. కంచికచర్ల మండలం మిగులూరుగ్రామానికి చెందిన గద్దె శివరామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు.
ఏపీ ఏసీబీ కోర్టులో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) రెడ్ బుక్ కేసుపై బుధవారం విచారణ జరిగింది. నారా లోకేష్‌ను అరెస్ట్ చేయాలని ఏపీ సీఐడీ వేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది.
టీడీపీ(TDP) కేంద్ర కార్యాలయానికి ఆంధ్రప్రదేశ్ సీఐడీ(AP CID Notice) అధికారులు నోటీసులు జారీ చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. ఆధారాలుంటే చూపాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. సీఐడీ(CID) సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుమలరావు ఈ నోటీసులను జారీ చేశారు. భూ యాజమాన్య హక్కు చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. మీ వద్ద ఉన్న సాక్ష్యాధారాలను ..
ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉండగా.. వైసీపీ తన అధికారాన్ని ఉపయోగించి విపక్షాలపై కక్షసాధింపులకు పాల్పడుతుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా పోలింగ్‌కు వారం రోజుల ముందు టీడీపీ అధినేత నారా చంద్రబాబు, యువనేత లోకేష్‌పై కేసు పెట్టడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అధికారం ఉందనే అహంకారం, తాను ఏం చేసినా చెల్లుతుందన్నట్లు వైసీపీ అధినేత జగన్ వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Andhrapradesh: తాడేపల్లి సిట్ కార్యాలయంలో హెరిటేజ్ పత్రాలు దగ్ధంపై మీడియాలో వచ్చిన కథనాలపై హెరిటేజ్ కంపెనీ సెక్రటరీ ఉమాకాంత్ బారిక్ స్పందించారు. ఈ ఘటను సంబంధించి సీఐడీ అడిషనల్ ఎస్పీకి ఉమాకాంత్ లేఖ రాశారు. సీఐడీ కస్టడీలో ఉన్న తమ ఒరిజినల్ డాక్యుమెంట్లు, మినిట్ పుస్తకాలను తాము అధికారుల కోరిక మేరకు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు.
Andhrapradesh: సిట్ కార్యాలయంలో దగ్ధం చేసింది హెరిటేజ్ డాక్యుమెంట్లు కాదని.. వేస్ట్ పేపర్స్‌ను దగ్ధం చేశామంటూ సిట్ అధికారులు ఇచ్చిన వివరణపై టీడీపీ నేత పట్టాభి మండిపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. సీట్ అధికారులు ఇచ్చిన వివరణకు ఎటువంటి పొంతన లేదన్నారు. వారు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు 100 తప్పులు చేస్తున్నారని విమర్శించారు. కచ్చితంగా దీనికి సిట్ అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
Andhrapradesh: తాడేపల్లి సీఐడీ సిట్ కార్యాలయంలో హెరిటేజ్ డాక్యుమెంట్ల దగ్ధం చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. కీలక డాక్యుమెంట్ల దగ్ధంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి తిరిగి రాదని తేలిపోవడంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. ఇదిలా ఉండగా.. ఫైళ్ల దగ్ధంపై సీఐడీ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. డాక్యుమెంట్ల దగ్ధంపై సిట్ కార్యాలయం వద్ద సీఐడీ వివరణ ఇచ్చింది. తాము దగ్ధం చేసిన పత్రాలు వేస్ట్ పేపర్లు అని పేర్కొంది.
Andhrapradesh: తాడేపల్లి సీఐడీ సిట్ కార్యాలయ కాంపౌండ్‌లో హెరిటెజ్‌కు సంబంధింన కీలక డాక్యుమెంట్ల దగ్ధంపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో టీడీపీ నేతలు మాట్లాడుతూ... ఎవరి ఆదేశాలతో డాక్యుమెంట్లు తగలబెట్టారనేది వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
తాడేపల్లి సిట్ కార్యాలయం కాంపౌండ్‌లో హెరిటేజ్ సంస్థ కి సంబంధించిన డాక్యుమెంట్లను కార్యాలయ సిబ్బంది తగులబెట్టారు. హెరిటేజ్ పత్రాలు దగ్ధం చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు ఆపి ఇదేంటని ప్రశ్నించగా.. పత్రాలు తగలబెట్టి వీడియోలు తమకి పెట్టమని సిట్ అధిపతి కొల్లి రఘురామ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారని సీఐడీ కార్యాలయం సిబ్బంది చెప్పారట.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులపై దాడి కేసులో నిందితుడు షేక్ షాజహాన్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ బుధవారం సాయంత్రం 4.30 గంటల కల్లా అప్పగించాలని పశ్చిమబెంగాల్ సీఐడీని కోల్‌కతా హైకోర్టు ఆదేశించింది. బెంగాల్ సీఐడీకి కోర్టు ధిక్కార నోటీసులు కూడా జారీ చేసింది.