Home » CricketWorldCup2023
టోర్నీ ఆసాంతం అద్భుత ఆటతీరు కనబరిచిన టీమిండియా బ్యాట్స్‌మెన్ కీలక ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం తడబడ్డారు. బౌలింగ్‌కు అనుకూలించిన స్లో పిచ్‌పై పరుగులు చేయడానికి కష్టపడ్డారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న యంగ్ బ్యాటర్లు శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో మూడు శతకాలు సాధించాడు. ఈ మెగా టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో భారీ సెంచరీ సాధించాడు.
Ind Vs Aus Final: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం జరిగే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు అంపైర్లను ఐసీసీ శుక్రవారం ప్రకటించింది. ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, రిచర్డ్ కెటిల్‌బరో ఆన్‌ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో (Richard Kettleborough) విషయమే భారతీయ అభిమానులను ఇప్పుడు కలవరపాటుకు గురి చేస్తుంది.
ఓట్ల వేటలో ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోకూడదు! ఎన్నికల్లో పోటీ పడే నేతాశ్రీలు అనుసరించే రూల్ నంబర్ వన్ ఇది. ఈ క్రమంలోనే..
Mitchell Marsh Prediction: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ తుది అంకానికి చేరుకుంది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో అతిథ్య జట్టు టీమిండియా, ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టుగా పేరుగాంచిన ఆస్ట్రేలియా తలపడనున్నాయి. స్టార్ క్రికెటర్ మిచెల్ మార్ష్ గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం భారత అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
మొదటి నాలుగు మ్యాచ్‌ల్లో అవకాశం రాలేదు.. రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు.. హార్దిక్ పాండ్యాకు గాయం కావడంతో ధర్మశాలలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తీసుకున్నారు.. అంతే.. తనను పక్కన పెట్టడం ఎంత తప్పిదమో మేనేజ్‌మెంట్‌కు అర్థమయ్యేలా చెలరేగిపోయాడు.. అతడు మరెవరో కాదు.. ఈ వరల్డ్ కప్‌లో టీమిండియా స్ట్రైక్ బౌలర్ మహ్మద్ షమీ.
మ్యాచ్ ప్రారంభమై ఆసక్తిగా సాగుతున్న సమయంలో ఉన్నట్టుండి ప్రత్యక్ష ప్రసారాన్ని ఆపేసి.. వైసీపీకి చెందిన ఫైల్ ఫొటోలు వేయడం ప్రారంభించారు. సీఎం జగన్ క్రికెట్ ఆడుతున్న చిత్రాలను
కొద్ది రోజులగా క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగిస్తున్న ప్రపంచకప్ అతి కీలక దశకు చేరుకుంది. లీగ్ దశ పూర్తి కావడంతో టాప్-4 జట్లు సెమీ ఫైనల్‌లో తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రపంచకప్‌లో అన్ని జట్లనూ ఓడించిన టీమిండియా బుధవారం జరగబోయే మొదటి సెమీ-ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఢీకొట్టబోతోంది.
నవంబర్ 15న ముంబై వేదికగా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ తలపడనుండగా... నవంబర్ 16న కోల్‌కతా వేదికగా దక్షిణాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Cricket World Cup 2023: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ ప్రపంచకప్ మ్యాచ్‌లకు ఇప్పటివరకు ఒక మిలియన్‌కు పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. అది కూడా మరో 6 మ్యాచ్‌లు మిగిలి ఉండగానే కావడం గమనార్హం. శుక్రవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా సౌతాఫ్రికా, అఫ్ఘానిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌తో ఈ రికార్డు పూర్తైంది.