Home » Cyber Crime
నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి సైబర్ నేరగాళ్లు(Cyber criminals) కాజేసిన డబ్బు రూ. 21.55 లక్షలను పోలీసులు రికవరీ చేశారు. సాంకేతిక ఆధారాల ద్వారా సైబర్ నేరస్థులు డబ్బును ఏ ఖాతాలకు మళ్లించారో గుర్తించి ఆ ఖాతాలను ఫ్రీజ్ చేశారు.
తమ స్టాక్ బ్రోకింగ్ సంస్థలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇస్తామంటూ నమ్మించారు. సంవత్సరానికి 120% వడ్డీ.. అర్ధ సంవత్సరానికి 54%, నెలకు 7% వడ్డీతో కలిపి లాభాలు ఇస్తామంటూ స్కీములు పెట్టారు.
సైబర్ నేరగాళ్ల ఆగడాలకు మరో నిండు ప్రాణం బలైపోయింది. తన కూతురిని వ్యభిచారం కేసులో అరెస్టు చేసినట్టు ఫోన్ కాల్ రావడంతో హడలిపోయిన ఓ టీచర్ గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఆగ్రాలో వెలుగు చూసింది.
రోజుకో కొత్తరకం మోసంతో అమాయకులను బురిడీ కొట్టించి కోట్లు కొల్లగొడుతున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫొటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్న ఇద్దరు సైబర్ క్రిమినల్స్ ఆట కట్టించారు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు.
హైదరాబాద్‌లో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. వాట్సాప్ కాల్ చేసి డిజిటల్ అరెస్ట్ పేరిట సైబర్ నేరగాళ్లు బాధితుడిని మోసం చేశారు.. బాధితుడి దగ్గరి నుంచి రూ.10.61 కోట్లను సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. హైదరాబాద్‌కు చెందిన వృద్ధుడు(73) తనకు ఎలాంటి సంతానం లేకపోవడంతో డబ్బునంతా బ్యాంకులో జమ చేసుకున్నాడు.
గూగుల్‌లో రేటింగ్ ఇస్తే డబ్బులు సంపాదించవ్చని నమ్మించిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) నగరానికి చెందిన విద్యార్థి నుంచి రూ. 1.90 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన విద్యార్థిని (21)కు వాట్స్‌పలో ఓ సందేశం వచ్చింది. గూగుల్‌లో రేటింగ్ ఇస్తే డబ్బులు సంపాదించవచ్చని చెప్పడంతో ఆన్లైన్ గూగుల్ రేటింగ్ టాస్క్‌లో చేరింది.
మీ అడ్రస్ అప్డేట్ చేస్తే తపాలాశాఖ నుంచి వచ్చిన పార్సిల్ ఇంటికి చేర్చుతామని నమ్మబలికిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) రూ. 2.43 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన మహిళకు 8210587741 నెంబర్ నుంచి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. కొత్త అడ్రస్ అప్డేట్(Update) చేస్తే పార్సిల్‌ను ఇంటికి చేర్చుతామంటూ వాట్స్‌పలో లింక్ పంపారు.
సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. వీడియో కాల్ చేసి.. పోలీసుల్లా మాట్లాడుతూ.. అరెస్టు చేస్తాం అని బెదిరించి డబ్బులు దండుకునే గ్యాంగులకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.
సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సైబర్ క్రైమ్‌కు ప్రధాన కారణంగా మారిన సిమ్ కార్డులు, మొబైల్ ఫోన్లపై దృష్టిపెట్టింది.