Home » Devi Reddy Sudheer Reddy
ఎల్బీ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. నేను శంకుస్థాపనలు చేసిన పనుల వద్ద ఫొటోలు దిగుతూ షో చేస్తున్నరు.. అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఇప్పుడు పెనుదుమారానికి దారితీశాయి. కాంగ్రెస్ నాయకులు మధుయాష్కీగౌడ్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యా్ఖ్యలతో నియోజకవర్గంలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది.
ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎంపీ మధుయాష్కీపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఆరు నెలలు అమెరికాలో, ఆరు నెలలు భారత్‌లో ఉంటూ కాంగ్రెస్ పార్టీలో తన ఉనికిని కాపాడుకునేందుకు రాజకీయాలు చేయడం మధుయాష్కీకి పరిపాటిగా మారిందని ఆయన అన్నారు.
ఒకే పనికి అటు ఎమ్మెల్యే, ఇటు కార్పొరేటర్ శంకుస్థాపన చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి శంకుస్థాపన చేసిన పనులను సోమవారం మరోసారి మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి శంకుస్థాపన చేయడానికి వస్తున్నారని తెలుసుకున్న బీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు.
భారతీయ జనతా పార్టీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అటు బీజేపీ, ఇటు తనపై నాపై అసత్య ప్రచారాలు చేసి తన అక్కసు వెల్లగక్కుతున్నారని బీజేపీ సీనియర్ నేత కొప్పుల నర్సింహారెడ్డి పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరికీ తలొంచకుండా సక్రమ నిర్మాణాలు చేపట్టాలంటూ సంబంధిత అధికారుకు ఆయన సూచనలు చేశారు. అక్రమంగా చేపడుతున్న కట్టడాల వద్ద వసూళ్లకు మరిగి వత్తాసు పలుకుతున్నారంటూ ఆయన విమర్శించారు.
ఎల్బీనగర్‌లోని సిరీస్ కం పెనీ, ఆటోనగర్ చెత్త డంపింగ్ యార్డ్‌ను యుద్ధ ప్రాతిపదికన తొలగించినం దుకే