MLA: ఉనికిని కాపాడుకోవడానికే టూరిస్టు రాజకీయాలు..
ABN , Publish Date - Apr 05 , 2025 | 11:06 AM
ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎంపీ మధుయాష్కీపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఆరు నెలలు అమెరికాలో, ఆరు నెలలు భారత్‌లో ఉంటూ కాంగ్రెస్ పార్టీలో తన ఉనికిని కాపాడుకునేందుకు రాజకీయాలు చేయడం మధుయాష్కీకి పరిపాటిగా మారిందని ఆయన అన్నారు.

- ఉనికిని కాపాడుకోవడానికే టూరిస్టు రాజకీయాలు..
- మధుయాష్కీ తీరుపై ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మండిపాటు
హైదరాబాద్: ఆరు నెలలు అమెరికాలో ఆరు నెలలు భారత్‌లో ఉంటూ కాంగ్రెస్ పార్టీలో తన ఉనికిని కాపాడుకునేందుకు రాజకీయాలు చేయడం మధుయాష్కీకి పరిపాటిగా మారిందని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి(MLA Devareddy Sudheer Reddy) విమర్శించారు. శుక్రవారం ఎల్బీనగర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మధుయాష్కీ తీరును సుధీర్‌రెడ్డి ఎండగట్టారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీల చీకటి పొత్తుతోనే ప్రోటోకాల్ రగడ సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. మధుయాష్కీ అవగాహన లేమితో బీజేపీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులను తప్పుదోవపట్టించి రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు.
ఈ వార్తను కూడా చదవండి: MIM, BJP: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలో ఎంఐఎం, బీజేపీ
సంవత్సర కాలంగా నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులను ప్రారంభించకుండా అటు అధికారులను, జిల్లా ఇన్‌చార్జి మంత్రిని తప్పుదోవపట్టించే విధంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా మధుయాష్కీ వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. ఎన్నడూ లేని విధంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి బీఆర్‌ఎస్(BRS)ని విమర్శిస్తున్నారన్నారు. కనీస అవగాహన లేకుండా బీజేపీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నేతలు కలిసి ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో మూడవస్థానంలో నిలిపి ప్రజలు బుద్ధి చెప్పినా మధుయాష్కీ చిల్లర రాజకీయాలు మానుకోవడం లేదని మండిపడ్డారు. మధుయాష్కీ తనపై వ్యక్తిగత దూషణలకు దిగడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. రాజకీయాలలో హుందాతనం చాలా అవసరమన్నారు. రెండుసార్లు ఎంపీగా పనిచేసిన వ్యక్తి ఈ విధంగా ప్రవర్తించడం తగునా అని అన్నారు.
హస్తినాపురం కార్పొరేటర్ సుజాతానాయక్ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నదని కావునా తానేమి మాట్లాడనని ఆయన చెప్పారు. కోర్టుతీర్పు అనంతరం ఆ అంశంపై మాట్లాడుతానన్నారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్లు కొప్పుల విఠల్‌రెడ్డి, జిన్నారం విఠల్‌రెడ్డి, సామ తిరుమల్‌రెడ్డి, భవానీ ప్రవీణ్, సాగర్‌రెడ్డి, జిట్టా రాజశేఖర్‌రెడ్డి, పద్మ శ్రీనివాస్‌నాయక్, బీఆర్‌ఎస్ బీఎన్‌రెడ్డి డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
రెచ్చిపోయిన దొంగలు.. ఏకంగా ఏటీఎంకే ఎసరు పెట్టారుగా..
Read Latest Telangana News and National News