Home » Election Commission of India
రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నగరా మోగింది. జమ్ముకశ్మీర్లో మూడు దశల్లో (సెప్టెంబరు 18, 25, అక్టోబరు 1).. హరియాణాలో అక్టోబరు 1న శాసనసభ ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల కమిషన్ శుక్రవారం వెల్లడించింది.
Jammu and Kashmir Election Schedule: దేశంలో మరో ఎన్నికల నగారా మోగింది. జమ్మూ కశ్మీర్, హర్యానా రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. శుక్రవారం నాడు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 3వ తేదీతో హర్యానా అసెంబ్లీ పదవీ కాలం..
లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత తిరిగి పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా జమ్మూకశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ శుక్రవారం ప్రకటించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ తర్వాత ప్రకటిస్తామని తెలిపారు.
దాదాపు 200 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో 88 మంది ఐఏఎస్, కాశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారులను బదిలీ చేసింది. అలాగే 33 మంది ఐపీఎస్లను బదిలీ చేసింది. వీరంతా ఐజీల నుంచి సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు స్థాయి అధికారులను బదిలీ చేసింది.
జమ్మూకశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల కమిషన్ శుక్రవారం ప్రకటించింది. 90 అసెంబ్లీ స్థానాలున్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి మూడు విడతలుగా సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1వ తేదీల్లో ఎన్నికలు జరుగనుండగా, అక్టోబర్ 4న కౌంటింగ్ జరిపి ఫలితాలు వెల్లడిస్తారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 1న నిర్వహించనున్నారు. అక్టోబర్ 4న ఫలితాలు ప్రకటిస్తారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసి సుమారు రెండు నెలలైంది. మళ్లీ దేశంలో ఎన్నికల కోలహాలం మొదలుకాబోతుంది. ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు లేదా ఉప ఎన్నికలు జరుగుతుంటాయి. దీనిలో భాగంగా ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం రెండు రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన సన్నాహకాలను సమీక్షించేందుకు ఎన్నికల కమిషన్ ఆ రాష్ట్రంలో పర్యటిస్తోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సారథ్యంలోని ఈసీఐ బృందం సోమవారంనాడు చండీగఢ్ చేరుకుంది.
జిల్లాలో ఈనెల 20 నుంచి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. అలాగే 18-19 సంవత్సరాల యువతను కొత్త ఓటరుగా నమోదుకు భారత ఎన్నికల కమిషన్ అవకాశమిచ్చింది. ఈనెల 20 నుంచి అక్టోబరు 18వ తేదీ నాటికి సవరణ ప్రక్రియ పూర్తి చేసి, అదేనెల 29న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల సమాచారాన్ని ధ్రువీకరించాల్సి ఉంటుంది.
వచ్చే ఏడాది జరగనున్న మూడు శాసన మండలి స్థానాల ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా తయారీ షెడ్యూల్ను ఖరారు చేసింది.
పోలింగ్ శాతాల్లో భారీగా తేడాలు ఉన్నాయంటూ వస్తున్న విశ్లేషణలను ఆదివారం ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన వెంటనే ప్రకటించిన ఓట్ల శాతానికి, తుది ఓట్ల శాతానికి మధ్య మరీ ఎక్కువగా తేడా ఉందంటూ విశ్లేషణలు వచ్చాయి.