Home » Elon Musk
ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ ఘాటు రిప్లై ఇచ్చారు. ఓపెన్ఏఐ కోనుగోలు కోసం ఆఫర్ ఇచ్చిన క్రమంలో క్రేజీ రిప్లై ఇచ్చారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
అగ్రరాజ్యం అమెరికాలో కూడా టిక్‌టాక్‌కు నిషేధం ముప్పు పొంచి ఉంది. ఎంతో ఆదరణ పొందిన టిక్‌టాక్‌పై జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా నిషేధం విధించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం వస్తోంది. ఈ నేషధం ముప్పు నుంచి తప్పించుకునేందుకు టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ ఓ ప్లాన్ వేసినట్టు వార్తలు వస్తున్నాయి.
తన ఆధ్వర్యంలోని డోజ్ శాఖ ఉద్యోగులు వారానికి 120 గంటలు పనిచేస్తున్నారంటూ మస్క్ ఎక్స్ వేదికగా ప్రకటించడం ప్రస్తుతం సంచలనం రేపుతోంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఛాట్ జీపీటీ ఈ పొలిటికల్ పార్టీకి అనుగుణంగా ప్రవర్తిస్తోందని ఇటీవల ఓ పరిశోధనలో వెల్లడైంది. ఈ విషయాన్ని నేనూ సమర్థిస్తున్నాను అంటూ తాజాగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఏఐ పనితీరుపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది.
బోయింగ్ వ్యోమనౌక ‘స్టార్‌లైనర్’లో గతేడాది జూన్ 5న తోటి వ్యోమగామి బచ్ విల్మోర్తో ఐఎస్ఎస్ (ISS)కు చేరుకున్న సునీతా విలియమ్స్ అప్పటి నుంచి అక్కడే ఉన్నారు. ఏడు నెలలుగా అక్కడే చిక్కుకున్న ఆమె నడవటం మర్చిపోయానని ఇటీవల వెల్లడించడంతో అందరూ షాక్‌కు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వీలైనంత త్వరగా ఇద్దరు వ్యోమగాములను భూమికి తీసుకురావాలని స్పేస్ఎక్స్ని కోరినట్లు మస్క్ ప్రకటించారు..
ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ బైడెన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ISSలో చిక్కుకున్నారని, వారిని తీసుకురావడంలో బైడెన్ ప్రభుత్వం విఫలమైందని సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేశారు.
ఈరోజు డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి అనేక దేశాల నాయకులు హాజరు కానున్నారు. దీంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు బిలయనీర్లు కూడా పాల్గొనబోతున్నారు. ఎవరెవరనేది ఇక్కడ తెలుసుకుందాం.
మహా కుంభమేళా 2025కు రావాలని టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌కు ఆహ్వానం అందించారు. ఈ క్రమంలో ఆయన కుంభమేళాకు వస్తారని ఆయనను కలిసిన ప్రముఖ వ్యాపారవేత్తలు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
జాతీయ భద్రత దృష్ట్యా అమెరికా ప్రభుత్వం టిక్‌టాక్‌ను నిషేధించే అవకాశాలున్న నేపథ్యంలో యాప్ మస్క్ చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
ఇతర దేశాల రాజకీయ వ్యవహారాలపై గత కొన్ని వారాలుగా వరస వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారంటూ ఆయా దేశాలు, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఎలాన్ మస్క్ తండ్రి ఎర్రల్ మస్క్ కుమారుడి కామెంట్స్‌ను తప్పుపడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు..