Home » Elon Musk
ఇజ్రాయెల్ - ఇరాన్(Israeil - Iran) మధ్య పెరిగిన ఉద్రిక్తతలు యుద్ధానికి దారితీసేలా ఉండటంతో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్(Elon Musk) శుక్రవారం తనదైన శైలిలో స్పందించారు. ఇరు దేశాలకు శాంతి సందేశం ఇచ్చారు.
ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీ ఉద్యోగాల కోత విధించనుంది. ప్రపంచవ్యాప్తంగా 10 శాతం ఉద్యోగులను తొలగిస్తామని ప్రకటన చేసింది. టెస్లా కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తోంది. గత కొద్దిరోజుల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ లేదు. దాంతో ఉద్యోగాల కోత తప్పడం లేదని టెస్లా కంపెనీ ఉద్యోగులకు తెలిపింది.
కపై టెస్లా(tesla) కార్లలో టాటా సెమీకండక్టర్ చిప్స్(semiconductor chips) రానున్నాయా? నమ్మశక్యంగా లేదా? కానీ ప్రస్తుతం అలాంటి సంకేతాలే వినిపిస్తున్నాయి. టెస్లా తన గ్లోబల్ కార్యకలాపాలలో ఉపయోగించే సెమీకండక్టర్ చిప్‌లను కొనుగోలు చేయడానికి టాటా ఎలక్ట్రానిక్స్(Tata Electronics)తో వ్యూహాత్మక ఒప్పందంపై సంతకం చేసినట్లు తెలుస్తోంది.
సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో ఏఐ(AI) టెక్నాలజీ అనేక రంగాలను ప్రభావితం చేస్తోంది. దీని ప్రభావం ప్రధానంగా సాఫ్ట్వేర్ రంగంపై పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎలాన్ మస్క్(Elon Musk) నేతృత్వంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్(X) భారత్‌లోని 2 లక్షల మందికి పైగా యూజర్ల అకౌంట్లను తొలగించింది. లైంగిక దాడులు, పోర్నోగ్రఫి, ఉద్రిక్తతలను ప్రోత్సహించే కంటెంట్ కట్టడిలో భాగంగా ఒక నెల వ్యవధిలో ఏకంగా 2 లక్షల12 వేల 627 ఖాతాలను నిషేధించింది.
ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్(Elon Musk) ఈ నెలలో (ఏప్రిల్ 22 నుంచి 27 మధ్య) భారత్ సందర్శించి ప్రధాని నరేంద్ర మోదీ(narendra modi)ని భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటన సందర్భంగా మస్క్ దేశంలో పెట్టుబడి ప్రణాళికలు, కొత్త టెస్లా ప్లాంట్ నిర్మాణం గురించి కూడా ప్రకటించవచ్చని భావిస్తున్నారు.
తయారీ రంగంలోని వారి గురించి ఇటీవల టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గ్యారేజీలో ఒంటరిగా కూర్చొనే ఆవిష్కర్తల గురించి సినిమాలు వచ్చాయి.. తయారీ రంగానికి చెందిన వారి గురించి సినిమా రాలేదని అభిప్రాయ పడ్డారు. ఆ ట్వీట్‌కు పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. తయారీ రంగంలోని హీరోల గురించి సినిమాలు రావాల్సిందేనని అంగీకరించారు.
సోషల్ మీడియా(social media)లో గతంలో వెలుగులోకి వచ్చిన క్రౌడ్ ఫండింగ్(crowdfunding) విధానం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే ఇటివల ఈ అంశంపై టెస్లా వ్యవస్థాపకుడు, ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన ట్విట్టర్ స్పందించింది. ఈ నేపథ్యంలో భారత సంతతికి చెందిన వైద్యురాలు కుల్విందర్ కౌర్ గిల్(Kulwinder Kaur gill)కు రెండు కోట్ల రూపాయల సాయం చేస్తామని ప్రకటించారు.
గతంలో ఉన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసి Xగా మార్చి అనేక మార్పులు చేశారు. ఈ క్రమంలోనే అర్హతగల సృష్టికర్తల కోసం 'యాడ్ రెవెన్యూ షేరింగ్' ప్రోగ్రామ్‌ను కూడా ప్రారంభించారు. ఈ ప్రోగ్రామ్ ప్రవేశపెట్టినప్పటి నుంచి 150,000 కంటే ఎక్కువ మంది క్రియేటర్లకు 45 మిలియన్ డాలర్ల కంటే(రూ.3,73,54,50,000) ఎక్కువ మొత్తాన్ని చెల్లించినట్లు ఇటివల ప్రకటించారు.
టెస్లా, స్పేస్ ఎక్స్ వంటి సంస్థల యజమాని ఎలాన్ మస్క్(Elon Musk) ఇటివల డ్రగ్స్ వాడకం(Drug Usage) గురించి సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటన నేపథ్యంలో మస్క్ కంపెనీలలో పనిచేసే ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన ఏ ప్రకటన చేశారో ఇక్కడ తెలుసుకుందాం.