Home » Eluru
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన దాదాపు 40 రోజుల తర్వాత వైసీపీలో రాజీనామాల పర్వం మొదలైంది. ఆ పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలు.. జగన్ నాయకత్వంపై విశ్వాసం లేని నేతలంతా వైసీపీకి గుడ్‌బై చెబుతున్నారు.
జిల్లాలోని వేలేరుపాడు మండలం అల్లూరి నగర్- మాధారం మధ్య కొడిసేలా వాగు ప్రవాహంలో కారు కొట్టుకు పోయింది. కారులో అయిదుగురు ఉన్నట్లు సమాచారం. సమాచారం తెలుసుకున్న అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
Andhrapradesh: రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో (IIIT) ఎంపికైన విద్యార్థుల (Students) జాబితాను రాజీవ్ గాంధీ యూనివర్సిటీ అధికారులు గురువారం విడుదల చేశారు. ఈ ఏడాది ట్రిపుల్ ఐటీ ప్రవేశాలలో బాలికలదే పైచేయిగా నిలిచింది. మొత్తం 67.15 శాతం మంది విద్యార్థులు ఎంపికైనట్లు అధికారులు తెలిపారు.
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం లక్ష్మీనగర్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు.
Andhrapradesh: జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం లక్ష్మి నగర్ వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న ట్రాలీ లారీని అతి వేగంగా దూసుకొచ్చిన ఎర్టిగా కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు రాచభత్తుని భాగ్యశ్రీ (26), బొమ్మ కమలాదేవి (53), నాగ నితిన్ కుమార్ (5) గా గుర్తించారు.
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలోని వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు ఆదివారం రాత్రి సందర్శించారు.
Andhrapradesh: కరువు రహిత రాష్ట్రంగా చేయాలన్న ఉద్దేశంతోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బుధవారం ఉదయం తాళ్ళపూడి మండలం తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని విడుదల మంత్రి విడుదల చేశారు.
జంగారెడ్డిగూడెం(Jangareddygudem) మండలం దేవులపల్లి (Devulapalli) మాజీ సర్పంచ్ దోరేపల్లి లక్ష్మీనారాయణ ఇంట్లో భారీ చోరీ(Robbery) జరిగింది. ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి రూ.3.70లక్షలు సహా 8తులాల బంగారు ఆభరణాలు, 4కేజీల వెండి దొంగిలించారు.
ఎలూరు జిల్లా: పోలవరం ప్రాజెక్టును విదేశీ నిపుణుల బృందం ఆదివారం పరిశీలించనుంది. నాలుగు రోజులపాటు పోలవరంలోనే పర్యటించనుంది. ప్రాజెక్టు ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు, డయాఫ్రం వాల్ ప్రాంతాలను నిపుణులు పరిశీలిస్తారు. ప్రాజెక్టు ఇంజనీర్లు, క్రాంటాక్టు ఏజెన్సీలతో సమీక్షను నిర్వహిస్తారు.
కేరళకు ఆనుకుని అరేబియా సముద్రంతో పాటు బంగాళాఖాతం, కోస్తాంధ్రల్లో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. అలాగే అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో తేమ మేఘాలు ఆవరించడంతో రుతుపవనాలకు అనుకూలమైన వాతావరణం కొనసాగుతోంది.