Home » Fire Accident
ఓ పాఠశాలలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. పాత ఫర్నిచర్ దగ్ధమైంది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేయడంతో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది.
భాగ్యనగరంలో అగ్నిప్రమాదం జరిగింది. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ దగ్గర ఓ దుకాణంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక అధికారులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
సిగరెట్/ బీడీ తాగే కొందరు నిర్లక్ష్యంగా ఉంటారు. లైటర్‌తో వెలిగించి సిగరెట్‌కు అంటించుకొని మజా చేస్తుంటారు. చుట్టుపక్కల ఏం ఉంది..? మంటలు ఎగిసిపడే పెట్రో ఉత్పత్తులు ఉన్నాయా... లేవా అని ఆలోచన చేయరు. ఇంకొందరు పెట్రోల్ బంక్ సమీపంలో స్మోక్ చేసి, ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతుంటారు. అనంతపురంలో ఓ వ్యక్తి ఇలానే చేశాడు.
రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఎసెన్సియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి ముగ్గురు మృతిచెందగా.. దాదాపు 25మందికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతులు పూడి మోహన్ (20), సీహెచ్ హారిక(22), వై.చిన్నారావు(32)గా గుర్తించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే గాయపడిన క్షతగాత్రులను హుటాహుటిన అనకాపల్లిలోని పలు ఆస్పత్రులకు తరలించారు.
రాంబిల్లి మండలం అచ్చుతాపురం సెజ్‌లోని ఎసెన్సియా ఫార్మా పరిశ్రమలో అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు(CM Chandrababu), మంత్రి వాసంశెట్టి సుభాశ్(Vasamsetti subhash) తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. రియాక్టర్ పేలిన ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. 25మందికి తీవ్రగాయాలు అయ్యాయి. బాధితులను అనకాపల్లిలోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఎసెన్సియా ఫార్మా పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. 18 మంది గాయపడ్డారు. తీవ్ర గాయాలైన నలుగురు కార్మికులు చనిపోయారు.
కువైత్ వెళ్లిన భర్త అక్కడి నుంచే నిఘా పెట్టి, వేధిస్తుండడాన్ని భరించలేని ఓ తల్లి తన ఇద్దరి పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన శనివారం ఉదయం అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలో చోటు చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిన తర్వాత వింత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అదీ వర్షా కాలంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లోని ఫైల్స్ వరుసగా తగలబడుతున్నాయి. తాజాగా అంటే.. శనివారం తిరుపతిలోని శ్రీవారి పరిపాలన భవనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
గ్రీస్‌ను కార్చిచ్చు కమ్మేసింది. మంటలు రాజధాని ఏథెన్స్ను వేగంగా సమీపిస్తున్నాయి. దీంతో అక్కడి ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అగ్నికీలలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఐరోపా ఖండంలోనే అతిపెద్ద న్యూక్లియర్ విద్యుత్తు కేంద్రమైన జపోరిజియాలో ఆదివారం భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఉక్రెయిన్ జరిపిన క్షిపణి దాడుల వల్లే ప్లాంట్‌లో మంటలు చెలరేగాయని రష్యా ఆరోపించగా.. ప్లాంట్‌లో కూలింగ్ టవర్స్‌లో మంటలకు రష్యానే కారణమని ఉక్రెయిన్ పేర్కొంది.