Home » GHMC
గ్రేటర్ హైదరాబాద్(Greater Hyderabad)లో ఆస్తిపన్ను నగదు చెల్లింపులకు ప్రభుత్వం పుల్‌స్టాప్ పెట్టింది. ఇప్పటి వరకు ఆస్తిపన్నులను నగదురూపంలోనే ఎక్కువ మంది చెల్లించేవారు. కొద్దిమంది మాత్రమే ఆన్లైన్ ద్వారా ఆస్తిపన్నులను చెల్లింస్తున్నారు.
బీఆర్ఎస్ ముఖ్య నాయకులు బీజేపీతో టచ్‌లోకి వెళ్లారన్న వార్తల నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్ష్‌కు సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి పదును పెట్టనున్నారా?
మెరుగైన పౌర సేవలు, ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, వనరుల నిర్వహణ కోసమే జీఐఎస్ సర్వే చేస్తున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట(GHMC Commissioner Amrapali Kata) తెలిపారు.
నగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీకి మెట్రోరైలు(Metro Rail) చాలామందికి ఉపశమనం కనిపిస్తోంది. దీంతో ఉదయం నుంచి రాత్రి వరకు మెట్రోస్టేషన్లలో ప్రయాణికుల సందడి కనిపిస్తోంది. రోజువారీగా సుమారు 4.80 లక్షల మందికిపైగా మెట్రోరైళ్లలో ప్రయాణిస్తున్నారు.
చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా హైడ్రా రంగంలోకి దిగింది. ఓ చెరువులో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు శ్రీకారం చుట్టింది.
జీహెచ్ఎంసీ సీనియర్ ఎంటమాలజిస్ట్ డాక్టర్ సంధ్యపై వేటుకు జీహెచ్ఎంసీ కమిషనర్ సిద్ధమయ్యారు. కిందిస్థాయి సిబ్బంది నుంచి డబ్బులు తీసుకుంటూ సీనియర్ ఎంటమాలజిస్ట్. అడ్డంగా బుక్కయ్యారు. దోమల నివారణకు ఫాగింగ్ చేయకుండానే ఎంటమాలజిస్ట్ సంధ్య బిల్లులు డ్రా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
ఏటా రూ.15 కోట్లు వెచ్చిస్తున్నా గ్రేటర్లో దోమల తీవ్రత పెరుగుతోంది. డెంగీ, మలేరియా(Dengue, Malaria) కేసులు అధికమవుతున్నాయి. లార్వా దశలో నియంత్రణకు రసాయనాల వినియోగం కాగితాలకే పరిమితమవుతోంది. ఫాగింగ్‌లో వాడాల్సిన డీజిల్‌ను అధికారులు తాగేస్తుండడంతో దోమలు ప్రజల రక్తం తాగుతున్నాయి. జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగంలో బయటపడిన మరో అవినీతి బాగోతం ఇందుకు నిదర్శనం.
జీహెచ్ఎంసీలో మరో అవినీతి తిమింగలం బయటపడింది. సీనియర్ ఎంటమాలజిస్ట్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తు్న్నాయి. తాజాగా జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఆమెపై దృష్టి పెట్టడంతో పలు విషయాలు బహిర్గతమయ్యాయి. జీహెచ్ఎంసీలో ఫాగింగ్ చేయకుండానే డీజిల్‌ని దుర్వినియోగం చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.
దేశ అత్యున్నత న్యాయస్థానం అవి హెచ్ఎండీఏ(HMDA) భూములని చెప్పినా కబ్జాదారులు రెచ్చిపోయారు. మూడు ఎక్స్కవేటర్లతో రూ.500 కోట్ల విలువైన సుమారు 50 ఎకరాలను చదును చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకొని ఆక్రమణదారులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
మహానగరానికి తాగునీటినందించే జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్(గండిపేట)లోకి చుక్క మురుగునీరు చేరకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోంది. ఈ జలాశయాల ఎగువన పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతుండడంతో భారీగా మురుగు వచ్చి చేరుతోంది.