Share News

ఇదేం ఖర్మరా బాబు.. లవ్ ఫెయిల్ అయితే.. మేకను పెళ్లి చేసుకుంటావా..

ABN , Publish Date - Mar 31 , 2025 | 04:32 PM

Man married goat: ఓ యువకుడు ఈ భూమ్మీద అమ్మాయిలే కరువైనట్లు మేకను పెళ్లి చేసుకున్నాడు. ప్రేమలో రెండు,మూడు సార్లు విఫలం అవ్వటంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇదేం ఖర్మరా బాబు.. లవ్ ఫెయిల్ అయితే.. మేకను పెళ్లి చేసుకుంటావా..
Man Married Goat

ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం.. అభినందన సినిమాలో హీరో ఎంతో బాధతో పాడే పాట ఇది. ప్రియురాలు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన తర్వాత.. హీరో పరిస్థితి దారుణంగా అయిపోతుంది. ఒకరకంగా పిచ్చివాడు అయిపోతాడు. ఆఖరికి చనిపోవాలని కూడా అనుకుంటాడు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో ఓ యువకుడు రెండు, మూడు సార్లు ప్రేమలో ఫెయిల్ అయ్యాడు. ఇక, ప్రేమ.. ప్రియురాలితో పెళ్లి అచ్చురాదని అతడికి అర్థం అయింది. అందుకే ఓ వింత, విచిత్రమైన నిర్ణయం తీసుకున్నాడు. అసలు ఈ భూప్రపంచంలో అమ్మాయిలే లేనట్లు.. ఓ మేకను పెళ్లి చేసుకున్నాడు. ఫొటో షూటు కూడా చేయించుకున్నాడు.


మేక భార్యతో వివిధ స్టైల్స్‌లో ఫొటోలు దిగాడు. ఈ సంఘటన ఎప్పుడు? ఎక్కడ? జరిగిందో తెలియరాలేదు. ఆ యువకుడి వివరాలు కూడా తెలియరాలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పెళ్లిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఈ వింత పెళ్లిపై స్పందిస్తున్న కొందరు నెటిజన్లు.. ‘ అరే ఏంట్రా ఇది.. ఇలా చేసేవేంట్రా’..‘ ఈ భూమ్మీద నీకసలు అమ్మాయే దొరకలేదా.. ఇది అనిమల్ క్రూయాల్టీ కిందకు వస్తుంది. అతడ్ని శిక్షించాలి’ అంటూ మండిపడుతున్నారు. మరికొందరు‘ బ్రో నువ్వు చేసింది కరెక్ట్.. ఈ కాలం అమ్మాయిల్ని అస్సలు నమ్మడానికి లేదు’..‘ ఆ మేక కూడా ఆడదే కదా.. మోసం చేసి వెళ్లిపోతుందేమో జాగ్రత్త’అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.


జాతకంలో దోషం.. మేకతో పెళ్లి..

సాధారణంగా జాతకంలో దోషం ఉన్నవారు మేకను పెళ్లి చేసుకుంటారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో ఓ యువకుడు మేకను పెళ్లి చేసుకున్నాడు. జాతకంలో దోషం ఉండటంతో.. దోష నివారణ కోసం ఆ యువకుడు మేక మెడలో తాళి కట్టాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలోని అన్నవరం రోడ్‌లో జరిగింది. 2022లో సరిగ్గా ఉగాది రోజున నవ గ్రహ ఆలయంలో పెళ్లి జరిగింది. అప్పట్లో ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.


ఇవి కూడా చదవండి:

ఇదేం విడ్డూరం.. తల్లికి కాన్పు చేసిన 13 ఏళ్ల బాలుడు..

ఉగాది అప్‌డేట్ ఇచ్చాడు

Updated Date - Mar 31 , 2025 | 04:32 PM