Kunal Kamra Row: కునాల్‌కు శివసేన స్టైల్‌లో స్వాగతం చెబుతాం.. రాహుల్ కనల్
ABN , Publish Date - Mar 31 , 2025 | 03:51 PM
అతిథులను దేవుడిగా భావించే సంస్కృతి ముంబైలో ఉందని, కునాల్ తనను తాను ముంబైకి అతిథిగా చెప్పుకుంటున్నారని, అలాంటపప్పుడు భయపడటం ఎందుకని రాహుల్ కనల్ ప్రశ్నించారు.

ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై అనుచిత వ్యాఖ్యల వివాదంలో చిక్కుకున్న స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్ర (Kunal Kamra)కు మద్రాసు హైకోర్టు ఏప్రిల్ 7వ తేదీ వరకూ ముందస్తు బెయిలు ఇవ్వడంపై శివసేన యువజన విభాగం నేత రాహుల్ కనల్(Rahool Kanal) స్పందించారు. కునాల్ ముంబై వచ్చి లీగల్ సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఆయన మహారాష్ట్రలో ఎప్పుడు అడుగుపెట్టినా ఆయనకు ''శివసేన స్టైల్''లో స్వాగతం పలుకుతామని చెప్పారు.
Sanjay Raut: మోదీ ఆ ప్లాన్‌తోనే ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లారేమో..
కునాల్ కామెడీ షో అనంతరం ముంబై హాబిటాట్ స్టూడియోపై దాడి చేసిన శివసేన కార్యకర్తలకు రాహుల్ నాయకత్వం వహించారు. ఈ దాడిలో రాహుల్ పాటు మరో 11 మంది కార్యకర్తలను ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వీరంతా బెయిలుపై విడుదలయ్యారు. ఇదే సమయంలో తనను చంపుతామంటూ బెదిరింపులు వస్తున్నాయని కునాల్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. తనను తాను విల్లిపురం వాసినని చెప్పుకోవడంతో ఆయనకు ఏప్రిల్ 7 వరకూ షరతులతో కూడిన ముందస్తు బెయిలును మద్రాసు హైకోర్టు మంజూరు చేసింది.
దీనిపై మీడియాతో రాహుల్ సోమవారంనాడు మాట్లాడుతూ, మద్రాసు హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, అయితే ఏప్రిల్ 7 వరకే ఆయనకు ముందస్తు బెయిలు ఉన్నందున ఆయన ముంబై వచ్చి విచారణను ఎదుర్కోవలసి ఉంటుందని చెప్పారు. తమిళనాడులో కునాల్‌కు ఎలాంటి రక్షణ ఉందో తమకు తెలియదని, ముంబైలో మాత్రం ఆయనకు 'శివసేన స్టైల్'లో స్వాగతం పలుకుతామని చెప్పారు. దీనిపై మరింత వివరిస్తూ, అతిథులను దేవుడిగా భావించే సంస్కృతి ముంబైలో ఉందని, కునాల్ తనను తాను అతిథిగా (ముంబైలో) చెప్పుకుంటున్నారని, అలాంటపప్పుడు భయపడటం ఎందుకని ప్రశ్నించారు. ఆయన చట్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని చెప్పారు. తాము సైతం లీగల్ విధివిధానాల ప్రకారం ప్రతిరోజూ పోలీస్ స్టేషన్‌కు హాజరవుతున్నట్టు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
వాట్సాప్‌లో కాదు.. పుస్తకాలు చదివి చరిత్ర తెలుసుకొండి: రాజ్‌ఠాక్రే
Monalisa Director: మోనాలిసా డైరెక్టర్‌పై కేసు.. అత్యాచారం, ఆపై అసభ్య వీడియోలతో వేధింపులు
For National News And Telugu News