Share News

Gnanavapi: భోజ్‪శాల మరో జ్ఞానవాపి అవుతుందా.. ఏఎస్ఐ సర్వేకు కోర్టు గ్రీన్ సిగ్నల్..

ABN , Publish Date - Mar 22 , 2024 | 01:10 PM

దేశవ్యాప్తంగా జ్ఞానవాపి మసీదు అంశం ఎంతటి వివాదాస్పద అంశంగా మారిందో అందరికీ తెలిసిందే. హిందువులు పరమ పవిత్రంగా భావిస్తున్న కాశీ విశ్వనాథ్ ఆలయంపై జ్ఞానవాపి ( Gnanavapi ) మసీదును నిర్మించారనే వార్తలు భారత్ అంతటా పెను సంచలనం కలిగించాయి.

Gnanavapi: భోజ్‪శాల మరో జ్ఞానవాపి అవుతుందా.. ఏఎస్ఐ సర్వేకు కోర్టు గ్రీన్ సిగ్నల్..

దేశవ్యాప్తంగా జ్ఞానవాపి మసీదు అంశం ఎంతటి వివాదాస్పద అంశంగా మారిందో అందరికీ తెలిసిందే. హిందువులు పరమ పవిత్రంగా భావిస్తున్న కాశీ విశ్వనాథ్ ఆలయంపై జ్ఞానవాపి ( Gnanavapi ) మసీదును నిర్మించారనే వార్తలు భారత్ అంతటా పెను సంచలనం కలిగించాయి. ఈ అంశంపై విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం నేలమాళిగలోని హిందూ ఆలయంలో పూజలకు అనుమతించింది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌లోని గిరిజనుల ప్రాబల్యం అధికంగా ఉన్న థార్ జిల్లాలోని వివాదాస్పద భోజ్‌శాల ఆలయంపై కమల్ మౌలా మసీదు నిర్మించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించిన భారత పురావస్తు శాఖ సర్వేకు ఉపక్రమించింది. ఈ రోజు తెల్లవారుజామున సర్వే బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఏఎస్ఐ ఈ చర్యలు చేపట్టింది.

మధ్యప్రదేశ్‌లోని థార్ జిల్లాలో ఉన్న భోజ్‌శాలలో ఆర్కియాలజికల్ సర్వే చేపట్టాలని మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ మార్చి 11న ఆదేశాలు ఇచ్చింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన జ్ఞానవాపి తరహాలో నిర్వహించే ఈ సర్వే నివేదికను 6 వారాల్లోగా కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. భోజ్‌శాలలో హిందువుల పూజలు, ముస్లింలు నమాజ్ చేస్తుంటారు. ఈ ఆలయంగా భావిస్తున్న మసీదులోకి ఎంట్రీ టిక్కెట్ కేవలం ఒక్క రూపాయి ఉన్నప్పటికీ పూజలు, నమాజ్ చేసేందుకు ఉచిత సౌలభ్యం కల్పించారు.

Hemant Soren: మనీ లాండరింగ్ కేసు.. మాజీ సీఎం జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు


ఈ విషయమై హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్ ఇండోర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హిందూ తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ వాదనలు వినిపిస్తూ భోజ్‌శాల సర్వే ఇరుపక్షాల సమక్షంలో జరుగుతుందని చెప్పారు. తద్వారా వాస్తవాలు తెలుస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 29 న వాయిదా వేశారు. ఈ క్రమంలో విచారణకు ముందే సర్వే పూర్తి చేసి నివేదికను కోర్టుకు సమర్పించనున్నారు.

BJP: ఆరాచకవాదులకు అడ్డాగా ఆ పార్టీ.. ఆప్ పై బీజేపీ విసుర్లు..

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 22 , 2024 | 01:10 PM