Home » Home Minister Anitha
అనితపై వ్యాఖ్యల తర్వాత డిప్యూటీ సీఎం పవన్- హోం మంత్రి కలిసి సమావేశంలో పాల్గొన్నారు. ఇద్దరు నేతలు దగ్గరగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇదే అంశంపై హోం మంత్రి అనిత వివరణ ఇచ్చారు.
గ్రామపంచాయతీల నిధులు కూడా మాజీ సీఎం జగన్ దోచుకున్నారని హోంమంత్రి అనిత విమర్శించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి సింపతీ క్రియేట్ చేయడం జగన్కి అలవాటుగా మారిందని మండిపడ్డారు. ఆడపిల్లలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలన్నదే జగన్ ఆలోచన అని హోంమంత్రి అనిత విమర్శించారు.
ఇంటర్ చదువుతున్న బాలిక దస్తగిరమ్మపై దాడి అనంతర దృశ్యాలు, పరిస్థితులు తనను తీవ్రంగా కలచివేశాయన్నారు. పెట్రోల్ పోసి నిప్పంటించిన విఘ్నేష్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు నేతృత్వంలో నాలుగు బృందాలు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టి అరెస్ట్ చేశారన్నారు.
రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద నిర్మూలనకు సహకరించాలని కేంద్ర హోం మంత్రి అమిత్షాకు రాష్ట్ర హోం మంత్రి అనిత విజ్ఞప్తి చేశారు.
‘పోలీసులు ఉన్నది ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడానికి. గత ప్రభుత్వం ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసి సొంత ప్రతీకారాలకు వాడుకుంది. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో ప్రజా పోలీసింగ్కే ప్రాధాన్యమిస్తాం.
తనను మానసికంగా, శారీరకంగా వైసీపీ నేతలు ఇబ్బంది పెట్టారని ముంబై నటి కాదంబరి జెత్వాని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితను కోరానని అన్నారు. ఎన్టీఏ కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలకు నటి కాదంబరి జెత్వాని ధన్యవాదాలు తెలిపారు.
Andhrapradesh: బద్రీనాథ్ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులు సురక్షితంగా ఉన్నారు. యాత్రికులతో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే తెలుగు యాత్రికులకు సంబంధించి ఢిల్లీ ఏపీభవన్ అధికారులతో హోంమంత్రి సమన్వయం చేశారు.
Andhrapradesh: ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్స్ అంశంపై హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బోట్స్ వాటికంత అవే కొట్టుకు రావా అని కొందరు అంటున్నారని.. ఎలా వస్తాయని ప్రశ్నిస్తూ.. వీరు ఉగ్రవాదుల కంటే చాలా డేంజర్ అంటూ వ్యాఖ్యలు చేశారు.
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దేశద్రోహం కేసు పెట్టాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. గత పదిరోజులుగా భారీ వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయని చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ కలెక్టర్ కార్యాలయంలోనే ఉండి సహాయక చర్యలను ఎప్పటికప్పుడూ పర్యవేక్షించారని వివరించారు.
అక్రమంగా కేసులు బనాయించి వేధించిన వారిపై చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనిత హెచ్చరించారు. ముంబయి సినీ నటి కాదంబరి జత్వాని కేసుపై ఆమె స్పందించారు. నటి కాదంబరి ఆన్లైన్లో ఫిర్యాదు చేశారన్నారు.