Anitha: హోం మంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Nov 07 , 2024 | 07:24 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ నోటి వెంట వినకూడని మాటలు వస్తున్నాయని మండిపడ్డారు. మా కుటుంబ సభ్యులపై నీచంగా మాట్లాడుతున్నారని తెలిపారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం తమదని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం జనరంజక పాలన అందిస్తోందని తెలిపారు.
అమరావతి: సోషల్ మీడియాలో పోస్ట్‌ల అంశం ఆంధ్రప్రదేశ్‌లో ప్రకంపనలు రేపుతోంది. తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతల లక్ష్యంగా చేసిన పోస్టులు దుమారం రేపాయి. ఈ అంశంపై హోం మంత్రి అనిత మాట్లాడారు. కొందరు తనను లక్ష్యంగా చేసుకొని పోస్టులు పెడుతున్నారని గుర్తుచేశారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.
గట్టిదాన్ని గనక
సోషల్ మీడియా పోస్టులపై అనిత స్పందిస్తూ.. ‘ఆ పోస్టులు చూసి బాధేసింది. కానీ నేను గట్టిదాన్ని. అందుకే చలించలేదు. బలహీన క్షణంలో కఠినమైన నిర్ణయం తీసుకోలేదు. లేదంటే ఆ పోస్టులను చూసి సూసైడ్ చేసుకునే పరిస్థితి. మానసికంగా బలహీనంగా ఉంటే అంతే సంగతులు. ఆత్మహత్య చేసుకునే వారు. పోస్టులు చేస్తోన్న వెదవలను ఊరికే వదిలే ప్రసక్తే లేదు. కొందరు సోషల్ మీడియాను అస్త్రంగా వాడుతున్నారు. ఉగ్రవాదుల కన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అలాంటి వారిని ఊరికే వదిలే ప్రసక్తే లేదు. చట్టం ముందు నిలబెడతాం. శిక్ష పడే వరకు వదిలబోం అని’ హోం మంత్రి అనిత స్పష్టం చేశారు.
జగన్ లక్ష్యంగా విమర్శలు
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ నోటి వెంట వినకూడని మాటలు వస్తున్నాయని మండిపడ్డారు. మా కుటుంబ సభ్యులపై నీచంగా మాట్లాడుతున్నారని తెలిపారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం తమదని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం జనరంజక పాలన అందిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో 28 శాతం క్రైం రేట్ తగ్గిందని గుర్తుచేశారు. రాజకీయ స్వార్థం కోసం చిన్నారుల అంశంపై మాట్లాడొద్దని సూచించారు.
ఇవి కూడా చదవండి...
AP News: ఎమ్మెల్యే మాధవి ఇష్యూ.. కడప మేయర్ ఏం చెప్పారంటే
Vasanthakrishna: త్వరలో నీకు సినిమా పక్కా.. జోగికి మైలవరం ఎమ్మెల్యే వార్నింగ్
Read Latest AP News And Telugu New