Home » Imran Khan
మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్-తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI),ఇతర పార్టీల మద్దతుదారులు సార్వత్రిక ఎన్నికలలో రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తూ దేశవ్యాప్త నిరసనలు చేపట్టారు. పాక్‌లో ఫిబ్రవరి 8న పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. 241 మిలియన్ల జనాభా కలిగిన పాక్ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం, తీవ్ర వాదం, ఉగ్రవాదంతో పోరాడుతోంది.
పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికలు(Pakistan Elections) హంగ్ దిశగా సాగుతున్నాయి. మాజీ ప్రధానులు ఇమ్రాన్ ఖాన్, నవాజ్ షరీఫ్ బలపరచిన స్వతంత్ర అభ్యర్థులు చాలా చోట్ల విజయం సాధించారు. అయితే ఎన్నికల సంఘం గెలిచిన పార్టీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే సైఫర్ కేసులో ఏడేళ్లు, తోషాఖానా అవినీతి కేసులో 14 ఏళ్ల జైలు శిక్ష పడిన ఆయనకు తాజాగా మరో షాక్ తగిలింది. బుష్రా బీబీతో తాను చేసుకున్న ‘వివాహం’ అతనిని ఊహించని ఇరకాటంలో పడేసింది.
తోషాకానా కేసులో(Toshakhana case) ఇప్పటికే తీర్పు వచ్చి శిక్షకు రెడీ అవుతున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు(Imran Khan) మరో చిక్కు వచ్చి పడింది. తాజాగా ఈ కేసులో ఆయన భార్య బుస్రా బీబీ( Bushra Bibi)కి కూడా 14 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఇస్లామాబాద్ కోర్టు తీర్పునిచ్చింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 8న జరగనున్న జాతీయ సార్వత్రిక ఎన్నికలను వాయిదా వేయాలన్న డిమాండ్ ను పాకిస్తాన్ సెనేట్ ఆమోదించింది.
పాకిస్తాన్ నేషనల్ ఎలక్షన్స్‌లో పోటీ చేయాలనుకున్న మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆశలపై ఎన్నికల సంఘం నీళ్లు చల్లింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన దాఖలు చేసిన రెండు నామినేషన్లను తిరస్కరించింది.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను వరుస వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పుడప్పుడే ఆయన కష్టాలు తగ్గే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. రోజురోజుకు ఆయన పేరు ఏదో ఒక వివాదంతో ముడిపడి ఉంటోంది..
టీవీ లైవ్ డిబెట్ల(TV Live Debates)లో లీడర్ల వాదనలు చూస్తూనే ఉంటాం. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ, వ్యక్తిగత విమర్శలకు సైతం వెనకాడబోరు. అవి చాలవనుకుంటే ఏకంగా భౌతికదాడులకు దిగుతారు. ఇలాంటి ఉదంతాలు భారత మీడియా చరిత్రలో చాలానే చూశాం. అయితే దాయాది దేశం పాకిస్థాన్(Pakisthan) లో అచ్చం ఇలాంటి ఘటనే జరిగింది.
పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్‌ఖాన్‌కు భారీ ఊరట లభించింది. తోషాఖానా కేసులో ట్రయల్ కోర్టు విధించిన మూడేళ్ల జైలు శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు మంగళవారంనాడు నిలిపివేసింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ బెయిలుపై విడుదలయ్యేందుకు మార్గం సుగగమైంది.
తోషఖానా కేసులో అటక్ జైలులో ఉన్న తన భర్త, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలకు ప్రమాదం ఉందని, జైలులో ఆనయపై విష ప్రయోగం జరగవచ్చని ఆయన భార్య బుష్రా బీబీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు పంజాబ్ హోం శాఖ కార్యదర్శికి శనివారంనాడు ఆమె ఒక లేఖ రాశారు.