Home » India vs South Africa
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. 36 ఏళ్ల వయసులోనూ కెప్టెన్‌గా జట్టును అద్భుతంగా నడిపిస్తూ టీమిండియాకు విజయాలు అందిస్తున్నాడు. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా దుమ్ములేపుతున్నాడు.
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్(15/6) తన కెరీర్ అత్యుతమ ప్రదర్శనతో చెలరేగడంతో రెండో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో అతిథ్య సౌతాఫ్రికా జట్టు 55 పరుగులకే కుప్పకూలింది. మ్యాచ్ ఆరంభం నుంచి నిప్పులు చిమ్మిన సిరాజ్ బలమైన సౌతాఫ్రికా టాపార్డర్‌ను ఒంటి చేతితో పెవిలియన్ చేర్చాడు.
టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనికి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి చాలా కాలమే గడిచిపోయింది. కొన్నేళ్లుగా ధోని ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు.
భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న కీలకమైన రెండో టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా పేసర్లు నిప్పులుకక్కారు. ముఖ్యంగా టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్(6/15) విశ్వరూపం చూపించాడు.
సౌతాఫ్రికాతో మొదలైన రెండో టెస్టు మ్యాచ్ ఆరంభంలోనే టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు కక్కుతున్నాడు. ఆరంభంలోనే సౌతాఫ్రికా ఓపెనర్లు ఎయిడెన్ మాక్రమ్(2), డీన్ ఎల్గర్(4)ను పెవిలియన్ చేర్చాడు. ఆ కాసేపటికే టోనీ డి జోర్జి(2)ని కూడా ఔట్ చేశాడు.
మొదటి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్, 32 పరుగుల తేడాతో ఓటమిపాలడంపై క్రికెట్ లెజండ్ సచిన్ టెండూల్కర్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Team India: 2023లో టీమిండియా అద్భుతంగా ఆడింది. ఈ ఏడాది అనేక విజయాలను సొంతం చేసుకుంది. వన్డే వరల్డ్‌కప్ సాధించలేకపోయినప్పటికీ..ఈ ఏడాది చెరగని ముద్రవేసింది. విశ్వకప్‌లో వరుసగా విజయాలు సాధించింది. గ్రూప్ దశలో టాపర్‌గా నిలిచింది. సెమీస్‌లోనూ తడాఖా చూపించింది.
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఇప్పుడు అప్పుడు అంటున్నారు కానీ హార్దిక్ పాండ్యా ఎప్పుడూ కోలుకుంటాడనే అంశంపై ఎలాంటి స్పష్టత రావడం లేదు. వచ్చే నెలలో అఫ్ఘానిస్థాన్‌తో జరిగే టీ20 సిరీస్ నాటికి హార్దిక్ పాండ్యా కోలుకుంటాడని అంతా భావించారు.
KL Rahul: మిగతా భారత బ్యాటర్లు విఫలమైన చోట టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడాడు. 92 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో ఉన్న దశలో క్రీజులోకి వచ్చి రాహుల్ లోయర్ ఆర్డర్ బ్యాటర్లు శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లతో కలిసి విలువైన భాగస్వామ్యాలను నెలకొల్పాడు.
Virat Kohli: టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ రికార్డును సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు. సౌతాఫ్రికాతో మొదలైన మొదటి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ 38 పరుగులు చేశాడు. దీంతో భారత్, సౌతాఫ్రికా టెస్టు క్రికెట్ పోటీలో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా బ్యాటర్‌గా మూడో స్థానానికి చేరుకున్నాడు.