Home » Kanaka durga temple
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం నాటికి 8 వరోజుకు చేరాయి. ఇవాళ అమ్మవారు దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము 3 గంటల నుంచి భక్తులు అమ్మను దర్శించుకునేందుకు బారులు తీరారు.
ఇంద్రకీలాద్రిపై పోలీసులు, రెవెన్యూ, ఎండోమెంట్ అధికారుల సమన్వయలోపంపై మంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజనాలు, దర్శనాలు అంశాల విషయంలో అధికారుల అజమాయిషీ విషయమై మంత్రి సీరియస్ అయ్యారు.
ఇంద్రకీలాద్రిపై వీఐపీ క్యూలైన్లు పోలీసులకు తలనొప్పిగా మారాయి. ఇంద్రకీలాద్రిపై వీఐపీ క్యూలైన్ ఎంట్రన్స్ వద్ద పోలీసులపై ట్రస్టుబోర్డు మెంబర్ చింత శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగం చేయడానికి వచ్చారని తెలుసని.. అయితే ఏంటి అంటూ పోలీసులపై సీరియస్ అయ్యారు.
ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు అమ్మవారు ఏడవ రోజులలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణలో అమ్మవారి దర్శనమిస్తారు.
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. దుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఇవాళ మూలానక్షత్రం కావడంతో గుడికి భారీ సంఖ్యలో భక్తులు క్యూ కడుతున్నారు. ఇంద్రకీలాద్రికి అశేష భక్తజనం తరలివస్తుండటంతో ఎలాంటి అవాంతరాలు జరగకుండా భక్తులను పోలీసులు అదుపుచేస్తున్నారు..
విజయవాడ: ఇంద్రకీలాద్రి లడ్డూ ప్రసాదం పోటులో కలెక్టర్ ఢిల్లీరావు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. లడ్డూ ప్రసాదం నాణ్యతను పరిశీలించి అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు.
ఇంద్రకీలాద్రి లడ్డూ ప్రసాదం పోటులో కలెక్టర్ ఢిల్లీ రావు గురువారం ఉదయం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ఐదవ రోజు శ్రీ మహా చండీదేవిగా కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే అమ్మవారి దర్శన భాగ్యం కలిపించారు. ఎప్పడూ లేని విధంగా తొలిసారి దసరా ఉత్సవాలలో దుర్గాదేవి శ్రీ మహా చండీ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ గుడిలో శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న వేళ ఆధ్యాత్మిశోభ కనిపించకుండా పోయింది.
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.