Share News

AP Minister: దుర్గగుడిలో అధికారుల సమన్వయలోపంపై మంత్రి కొట్టు సీరియస్

ABN , First Publish Date - 2023-10-21T14:16:28+05:30 IST

ఇంద్రకీలాద్రిపై పోలీసులు, రెవెన్యూ, ఎండోమెంట్ అధికారుల సమన్వయలోపంపై మంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజనాలు, దర్శనాలు అంశాల విషయంలో అధికారుల అజమాయిషీ విషయమై మంత్రి సీరియస్ అయ్యారు.

AP Minister: దుర్గగుడిలో అధికారుల సమన్వయలోపంపై మంత్రి కొట్టు సీరియస్

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై పోలీసులు, రెవెన్యూ, ఎండోమెంట్ అధికారుల సమన్వయలోపంపై మంత్రి కొట్టు సత్యనారాయణ (Minister Kottu Satyanarayana) ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజనాలు, దర్శనాలు అంశాల విషయంలో అధికారుల అజమాయిషీ విషయమై మంత్రి సీరియస్ అయ్యారు. వివక్ష లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు జరగాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సీపీ, కలెక్టర్లకు కొట్టు సత్యానారాయణ నోట్ పంపారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లడుతూ.. వీఐపీ మార్గం అంటే టికెట్టు లేకుండా వెళ్ళే మార్గం అయిపోయిందన్నారు. వీఐపీ టికెట్టు దర్శనంపై కూడా ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇవాళ అమ్మవారు లలితా త్రిపురసుందరీ దేవిగా దర్శనం ఇస్తున్నారన్నారు. నిన్న 2 లక్షలు మంది భక్తులు దర్శనం చేసుకున్నారని.. అధికారుల సమన్వయంతో నిన్న అద్భుతంగా కార్యక్రమం జరిగిందన్నారు. కిందిస్ధాయి పోలీసు సిబ్బంది సమస్యలు కలిగిస్తున్నారన్నారు. పోలీసులకు సంబంధించిన వారిని మాత్రమే దర్శనానికి పంపడం ఇబ్బందికరమన్నారు. పోలీసుల విషయమై ఒక నోట్ కూడా సీపీకి పంపిస్తున్నట్లు చెప్పారు. సమన్వయం తప్పిన అధికారుల విషయమై ఆదేశాలు ఇవ్వాలని కలెక్టర్, సీపీలకు చెపుతామన్నారు. భక్తులకు సదుపాయాల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. ఇప్పటి వరకూ 5.8 లక్షల మంది దర్శనం చేసుకున్నారని చెప్పారు. ఉగ్రరూపంలో దర్శనం చేసుకున్న వారు.. శాంత రూపంలో దర్శనం చేసుకోవాలనుకుంటారన్నారు. సోమవారం కూడా 2 లక్షలకు పైబడి భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. భోజనాలు పెట్టడం విషయంలో ఇక్కడ భోజనాలు పెట్టకూడదు అని పోలీసులు అన్నారని.. సదరు పోలీసు అధికారి విషయంలో సీపీతో మాట్లాడనున్నట్లు తెలిపారు. ఎండోమెంట్ అధికారులు కూడా బాధ్యతగా ఉండాలని.. ఇది మన ఇంటి పండుగ అని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు.

Updated Date - 2023-10-21T14:16:28+05:30 IST