Home » Kolkata Knight Riders
ఈ సీజన్‌లో లీగ్ దశలో అద్భుతాలు నమోదు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు.. ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చింది. టైటిల్ పోరులో ప్రత్యర్థి జట్టుపై పరుగుల సునామీ సృష్టిస్తుందని భావిస్తే.. అందుకు భిన్నంగా పేకమేడలా కుప్పకూలింది.
ఐపీఎల్ 2024(IPL 2024) 17వ సీజన్ ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది. ఎందుకంటే కాసేపట్లో ఫైనల్ మ్యాచ్ చెన్నై(Chennai)లోని చిదంబరం స్టేడియం(Chidambaram Stadium)లో సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad), కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) జట్ల మధ్య జరగనుంది. ఈ నేపథ్యంలో చెన్నైలోని చిదంబరం స్టేడియానికి క్రీడాభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
ప్రపంచంలో అత్యధికంగా వీక్షించే క్రికెట్ లీగ్ ఐపీఎల్. 2008లో ప్రారంభమైన ఐపీఎల్(IPL 2024) ఈసారి 17వ సీజన్ లీగ్ జరుగుతోంది. నేటి ఫైనల్ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్(KKR), సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) జట్ల మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు జరగనుంది. అయితే ఈ ఐపీఎల్ 2024 టైటిల్ గెలిచిన, ఓడిన జట్టుకు ఎంత ప్రైజ్ మనీ వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎట్టకేలకు ఐపీఎల్ 2024 సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఆఖరి సమరానికి వేళయ్యింది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో టైటిల్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. చెన్నైలోని చెపాక్ వేదికగా..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024(IPL 2024) ఫైనల్ మ్యాచ్ సమయం రానే వచ్చింది. రేపు (మే 26న) సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH), కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. చెన్నై(chennai)లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు గెలిచి మళ్లీ చరిత్రను పునరావృతం చేసే మంచి ఛాన్స్ వచ్చింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) సీజన్ 17 చివరకు దశకు వచ్చేసింది. ఈ సీజన్‌లో ట్రోఫీని కైవసం చేసుకునేందుకు కోల్‌కతా నైట్ రైడర్స్(KKR), సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) జట్లు రేపు (మే 26) తలపడనున్నాయి. అయితే చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచుకు వర్షం ముప్పు పొంచి ఉందా, ఉంటే ఎలా అనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
ఐపీఎల్-2024లో అసలు సిసలైన సమరానికి తెరలేచింది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ జట్ల మధ్య క్వాలిఫయర్-1 మ్యా్చ్ షురూ అయ్యింది. ఈ మ్యాచ్‌లో టాస్ పడింది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఐపీఎల్-2024లో నేటి (మంగళవారం) నుంచి ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు షురూ కానున్నాయి. అహ్మదాబాద్ వేదికగా క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR vs SRH) జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. ఓడిపోయిన జట్టు క్వాలిఫైయర్-2 మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది.
ఐపీఎల్ 2024(IPL 2024) సీజన్ ప్రస్తుతం ప్లేఆఫ్ దశకు చేరుకుంది. ఈ క్రమంలో నేడు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) క్వాలిఫయర్1లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) జట్టుతో తలపడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు జరగనుంది. ఈ నేపథ్యంలో ఈరోజు అహ్మదాబాద్‌లో వాతావరణం ఎలా ఉంది, వర్షం వచ్చే ఛాన్స్ ఉందా, పిచ్ పరిస్థితి ఏంటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఐపీఎల్ 2024(IPL 2024)లో రేపు కీలక మ్యాచ్ జరగనుంది. క్వాలిఫయర్ 1లో టేబుల్ టాప్‌లో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders), రెండో ర్యాంకర్ సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) మధ్య రేపు (మే 21) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచులో ఏ జట్టు గెలిచే అవకాశం ఉంది, స్టేడియం పిచ్ ఎలా ఉందనే విషయాలను ఇక్కడ చుద్దాం.