Home » Kolkata Knight Riders
వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నేటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచులో ఏ జట్టు గెలుస్తుందనే అంచనాలను ఇక్కడ చుద్దాం.
వెస్టిండీస్ మాజీ ఆటగాడు, కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ సునీల్ నరైన్ ఐపీఎల్లో సరికొత్త సంచలనానికి పునాది వేశాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో కదం తొక్కిన అతను.. ఐపీఎల్ చరిత్రలో ఎవ్వరికీ సాధ్యం కాని ఓ చారిత్రాత్మక రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
మంగళవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌పై రాజస్థాన్ రాయల్స్ సాధించిన అద్భుతమైన విజయంలో జోస్ బట్లర్ పాత్ర అత్యంత ప్రధానమైందని చెప్పుకోవడంలో సందేహమే లేదు. 224 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా.. ఆ జట్టు 14 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 128 పరుగులే చేసినప్పుడు, బట్లర్ సంచలన ఇన్నింగ్స్‌తో మెరిశాడు.
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ దుమ్ము దులిపేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. సునీల్ నరైన్ (56 బంతుల్లో 109) సెంచరీతో శివాలెత్తడం వల్లే.. కేకేఆర్ ఇంత భారీ స్కోరు చేయగలిగింది.
ఐపీఎల్ 2024లో (IPL 2024) కోల్‌కతా నైట్ రైడర్స్ మరో విజయాన్ని సాధించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ని చిత్తుగా ఓడించింది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ 89 పరుగులతో చెలరేగడంతో 162 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోవడంతో 8 వికెట్ల తేడాతో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లు మరోసారి రాణించారు. లక్నో సూపర్ జెయింట్స్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా లక్ష్యం 162 పరుగులుగా ఉంది. లక్నో బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (39), ఆయుశ్ బదోనీ (29), నికోలస్ పూరన్ (45) మాత్రమే ఫర్వాలేదనిపించారు.
ఈ రోజు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024(IPL 2024)లో కోల్‌కతా(Kolkata)లోని ఈడెన్ గార్డెన్స్‌లో మధ్యాహ్నం 3:30 గంటల నుంచి కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders), లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచులో ఏ జట్టు గెలుస్తుందో గెలుపు అంచనాలను ఇక్కడ చుద్దాం.
గౌతం గంభీర్-మహేంద్ర సింగ్ ధోని. ఈ రెండు పేర్లు వినగానే అందిరికీ గుర్తొచ్చేది 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్. ఆ మ్యాచ్‌లో వీరిద్దరు ఆడిన ఆట ఇప్పటికీ క్రికెట్ అభిమానుల కళ్ల ముందు మెదులుతూనే ఉంటుంది.
ఐపీఎల్(IPL) చరిత్రలో రవీంద్ర జడేజా(ravindra jadeja) అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 100 క్యాచ్‌లు(100 catches) పట్టిన 5వ క్రికెటర్‌గా రవీంద్ర జడేజా నిలిచాడు. దీంతో ఐపీఎల్లో 100 క్యాచ్‌లతో పాటు 100 వికెట్లు, 1000 పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా జడేజా రికార్డు సృష్టించాడు.
చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు కలిసికట్టుగా చెలరేగడంతో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు తేలిపోయారు. స్లో పిచ్‌ను ఉపయోగించుకుని చెన్నై బౌలర్లు కట్టడి చేయడంతో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు చేతులెత్తేశారు. శ్రేయాస్ అయ్యర్(34) మిగతా వారంతా ఫ్లాప్ షోను కనబరిచారు.