Share News

IPL 2024: నేడు KKR vs PBKS మ్యాచ్..విన్ ప్రిడిక్షన్ ఎలా ఉందంటే

ABN , Publish Date - Apr 26 , 2024 | 07:52 AM

ఐపీఎల్ 2024(IPL 2024)లో నేడు 42వ మ్యాచ్ కోలకత్తా నైట్ రైడర్స్(Kolkata Knight Riders), పంజాబ్ కింగ్స్(Punjab Kings) జట్ల మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు జరగనుంది. ఇక కోలకత్తా నైట్ రైడర్స్ ప్రస్తుతం 7 మ్యాచ్‌ల్లో 5 గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. అదే సమయంలో పంజాబ్ కింగ్స్ 8 మ్యాచ్‌ల్లో రెండు గెలిచి 4 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది.

IPL 2024: నేడు KKR vs PBKS మ్యాచ్..విన్ ప్రిడిక్షన్ ఎలా ఉందంటే
Today KKR vs PBKS Match Win Prediction

ఐపీఎల్ 2024(IPL 2024)లో నేడు కోల్‌కత్తా నైట్ రైడర్స్(Kolkata Knight Riders), పంజాబ్ కింగ్స్(Punjab Kings) జట్ల మధ్య కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు 42వ మ్యాచ్ జరగనుంది. ఇక కోల్‌కత్తా నైట్ రైడర్స్ ప్రస్తుతం 7 మ్యాచ్‌ల్లో 5 గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.

అదే సమయంలో పంజాబ్ కింగ్స్ 8 మ్యాచ్‌ల్లో రెండు గెలిచి 4 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది. గత మ్యాచ్‌లో RCBపై KKR 1 పరుగు తేడాతో గెలిచింది. మరోవైపు GTతో జరిగిన చివరి మ్యాచ్‌లో PBKS 3 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.


కోల్‌కత్తా(Kolkata)లోని ఈడెన్ గార్డెన్స్(Eden Gardens) పిచ్ బౌలర్లు, బ్యాట్స్‌మెన్స్ ఇద్దరికీ అనుకూలంగా ఉంటుంది. ఈ పిచ్‌పై టాస్‌ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్‌కే మొగ్గుచూపుతుంది. ఇక్కడ ఫాస్ట్ బౌలర్ల కంటే స్పిన్నర్లకే ఎక్కువ సపోర్ట్ లభిస్తుందని క్రీడా వర్గాలు అంటున్నాయి. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు కేకేఆర్, పీబీకేఎస్ మధ్య మొత్తం 32 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో కోల్‌కతా 21 చోట్ల, పంజాబ్ 11 చోట్ల విజయం సాధించాయి. KKR పంజాబ్‌పై అత్యధిక స్కోరు 245 పరుగులు చేసింది. KKRపై పంజాబ్ అత్యధిక స్కోరు 214 పరుగులు.


ఇక గూగుల్ గెలుపు అంచనా ప్రకారం చూస్తే నేటి మ్యాచులో కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టుకు 59 శాతం గెలిచే అవకాశం ఉండగా, పంజాబ్ కింగ్స్ జట్టుకు 41 శాతం ఛాన్స్ ఉంది.

కోల్‌కత్తా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) జట్టు ప్రాబబుల్ 11లో ఫిల్ సాల్ట్ (WK), వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (C), రింకు, సునీల్ నారాయణ్, అంగ్క్రిష్ రఘువంశీ, సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా ఉన్నారు.

పంజాబ్ కింగ్స్(Punjab Kings) జట్టు ప్రాబబుల్ 11లో శామ్ కుర్రాన్ (C), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, రిలే రూసో, అశుతోష్ శర్మ, జితేష్ శర్మ (WK), లియామ్ లివింగ్‌స్టోన్, శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్ కలరు.


ఇది కూడా చదవండి:

రైజర్స్‌ కు ముకుతాడు


CIBIL Score: ఈ తప్పులు చేస్తున్నారా.. మీ సిబిల్ స్కోర్ ఖతం


Read Latest Sports News and Telugu News

Updated Date - Apr 26 , 2024 | 07:54 AM