Minister Kollu Ravindra: వైసీపీ హయాంలో బడా స్కాం.. మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్
ABN , Publish Date - Mar 27 , 2025 | 07:55 PM
Minister Kollu Ravindra: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి కొల్లు రవీంద్ర సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో మద్యం తయారీ నుంచి అమ్మకం వరకు అన్నింటిలో అవినీతి జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు.

కృష్ణా: నాటుసారా రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దేందుకు 2016లో తొలిసారిగా నవోదయం కార్యక్రమాన్ని ప్రారంభించామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా కృష్ణాజిల్లా కలెక్టరేట్‌లో సంబంధిత శాఖాధికారులతో ఇవాళ(గురువారం) మంత్రి కొల్లు రవీంద్ర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ.. ఆరు నెలల్లో నాటుసారాను పూర్తిగా నిర్మూలించాలన్న ఉద్దేశంతో నవోదయం 2.0 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. మే 1వ తేదీ నాటికి రాష్ట్రాన్ని నాటుసారా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.
గత జగన్ ప్రభుత్వంలో కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలను హరించారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వంలో అవినీతిమయమైన ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేస్తున్నామని చెప్పారు. మద్యం కుంభకోణంలో పాత్రధారులు, సూత్రధారులను గుర్తించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏపీలో మద్యం కుంభకోణం అతి పెద్ద స్కాం అన్నారు. ఢిల్లీలో కన్నా ఏపీలొనే మద్యం స్కాం ఎక్కువ అని టీడీపీ ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు పార్లమెంటులో చెప్పారని మంత్రి కొల్లు రవీంద్ర గుర్తుచేశారు.
జగనే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని నడిపించారని విజయసాయి రెడ్డి చెప్పారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మద్యం తయారీ నుంచి అమ్మకం వరకు అన్నింటిలో అవినీతి జరిగిందని ఆరోపించారు. జగన్ తన ఆదాయం పెంచుకుని... రాష్ట్ర ఆదాయం తగ్గించారని మండిపడ్డారు. నాసిరకం మద్యం ద్వారా ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారని విమర్శించారు. అసలు మద్యం అమ్మకాలు, వచ్చిన ఆదాయంపై విచారణ జరుగుతుందని చెప్పారు. సిట్ వేసిన సాయంత్రమే ఫైళ్లను తగులపెట్టారన్నారు. అన్నీ విచారణ పూర్తి అయ్యాక తప్పకుండా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. బియ్యం కేసు ఇంకా మూయలేదు... తమపై అనవసరంగా మాట్లాడే వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Jayamangala చంద్రబాబు కాళ్ల మీద పడ్డ వైపీసీ మాజీ నేత
CM Chandrababu: పోలవరం ప్రాజెక్టు సందర్శనకు..
Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. పలు చోట్ల ఉద్రిక్తత
For More AP News and Telugu News