Home » Lok Sabha Elections
సార్వత్రిక సమరం ముగిసింది అనుకుంటున్న వేళ మరో సమరం తెరపైకి వచ్చింది. అదే.. బీజేపీ సొంతంగా మెజారిటీ మార్క్ చేరకపోవడం. ప్రధాని మోదీ చరిష్మా మరోసారి మ్యాజిక్ చేస్తుందనుకున్న బీజేపీ నేతలకు ఇది మింగుడుపడటం లేదు.
ఎన్నికల్లో 15 మంది ముస్లిం అభ్యర్థులు విజయం సాధించారు. వీరిలో TMC అభ్యర్థి మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ ఉన్నారు. బహరంపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరిపై పఠాన్ విజయం సాధించారు.
లోక్‌సభ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో సెంటిమెంట్‌కు బ్రేక్ పడింది. ఒక పార్టీ ఒక స్థానం నుంచి వరుసగా రెండో, మూడోసారి నెగ్గదనే చర్చకు తెరపడింది. 1999 నుంచి సికింద్రాబాద్‌లో ఒకే పార్టీ వరుసగా మూడుసార్లు గెలవలేదు. 1999లో బీజేపీ, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాయి.
అధికారంలో ఏ పార్టీ ఉన్నదన్న దాంతో సంబంధం లేకుండా.. దేశాభివృద్ధి కోసం అన్ని రాష్ట్రాలతో కలిసి పని చేస్తామని ప్రధాని మోదీ చెప్పారు. తమ మూడో దఫా పాలనలో అవినీతిని కూకటివేళ్లతో పెకిలించటంపై దృష్టి పెడతామని స్పష్టం చేశారు.
లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డి 5,59,905 ఓట్ల ఆధిక్యంతో అతిపెద్ద విజయాన్ని అందుకున్నారు. రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధిక మెజారిటీ. అంతేకాదు.. అరంగేట్రంతోనే ఆయన దక్షిణాదిలో అత్యధిక మెజారిటీ సాధించడం విశేషం.
లోక్‌సభ ఎన్నికలు ముఖ్య నేతలు కొందరికి మోదాన్ని, మరి కొంత ఖేదాన్ని మిగిల్చాయి. సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ ఎన్నికలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. సీఎం రేవంత్‌రెడ్డి ఇలాకా పాలమూరులో కాషాయ పార్టీ గెలిచింది. బీఆర్‌ఎస్ ఖిల్లా మెదక్‌లోనూ కమలం వికసించింది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ కాంగ్రెస్ హస్తగతమైంది. ఈ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్ ఘనవిజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, బీజేపీ నేత వంశీచంద్ తిలక్‌పై 13,206 ఓట్ల మెజారిటీని సాధించా రు.
ఒడిసా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. 24 ఏళ్ల పాటు అప్రతిహతంగా రాష్ట్రాన్ని ఏలిన నవీన్ పట్నాయక్‌కు ప్రజలు షాక్ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ఆరోసారి ప్రమాణ స్వీకారం చేసి, దేశంలోనే అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించాలనుకున్న ఆయనకు నిరాశే మిగిలింది.
‘యూ-టర్న్ రారాజు’గా పేరొందిన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి యూ-టర్న్ తీసుకోబోతున్నారా? సార్వత్రిక ఎన్నికల ముంగిట ఇండియా కూటమిని వీడి ఎన్డీఏలో చేరిన ఆయన..
ఏపీలో అధికారంలోకి రావాలంటే గోదావరి జిల్లాల్లో గెలవాలనేది ఒక సెంటిమెంట్. ఈ రెండు జిల్లాల్లో కలిపి మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇక్కడ మెజార్టీ సీట్లు గెలిచిన పార్టీ ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది.