Home » Madhya Pradesh
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్రంగా మండిపడ్డారు. రాహుల్ గాంధీది భారత్ జోడో న్యాయ్ యాత్ర.. కాంగ్రెస్ తోడో, కాంగ్రెస్ చోడో యాత్రగా మారిందని విమర్శించారు. గత అనుభవాలు చూస్తే రాహుల్ గాంధీ యాత్రలు చేసిన ప్రతిచోట కాంగ్రెస్ ఓడిపోతుందన్నారు. రాహుల్ గాంధీ నిన్న ముంబైలో మరో విఫల యాత్రను ముగించారని ఎద్దెవా చేశారు.
లోక్సభ ఎన్నికలకు ముందు మధ్యప్రదేశ్లో కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం కమల్నాథ్ సన్నిహితుడు చింద్వారాకు చెందిన సయ్యద్ జాఫర్తో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారు. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి ఆర్ ఎస్ వర్మ కాషాయ కండువా కప్పుకున్నారు. వీరంతా బోపాల్లో సీఎం మోహన్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు వీడీ శర్మ సమక్షంలో బీజేపీలో చేరారు.
టెక్నాలజీలో రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్నా.. ఇప్పటికీ చాలా గ్రామాల్లో ప్రజలు కనీస సౌకర్యాల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు సమస్యలు వింటే అయ్యో.. పాపం..! అని అనిపిస్తే.. మరికొందరి సమస్యలు వింటే.. ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి...
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత కమల్ నాథ్ తమ కంచుకోట చింద్వారా లోక్ సభ నియోజకవర్గాన్ని వీడనని తేల్చిచెప్పారు. కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్ జబల్ పూర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. సోమవారం కమల్ నాథ్ స్పందించారు. నకుల్ జబల్ పూర్ నుంచి పోటీ చేయాలని అనుకోవడం లేదు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే చింద్వారాను తాము వదిలి పెట్టబోమని స్పష్టం చేశారు.
ఈ ఆధునిక యుగంలో రానురాను మానవత్వం మంటగలిసిపోతోందని చెప్పడానికి తాజా ఉదంతాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో కేవలం మ్యూజిక్ ఆపాడన్న కోపంతో.. సొంత అన్నయ్యనే కడతేర్చాడు ఓ దుర్మార్గుడు. రక్తం పంచుకొని పుట్టిన సోదరుడు అని కూడా చూడకుండా.. తనని డ్యాన్స్ చేయనివ్వలేదన్న నెపంతో గొడ్డలితో నరికి చంపేశాడు.
లోక్సభ ఎన్నికలు (Lok Sabha Elections) సమీపిస్తున్న తరుణంలో.. కాంగ్రెస్ పార్టీకి (Congress Party) వరుస దెబ్బలు తగులుతున్నాయి. సీనియర్, కీలక నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడి.. బీజేపీలోకి (BJP) చేరుతున్నారు. తమ నేతల్ని కోల్పోకుండా ఉండేందుకు కాంగ్రెస్ సాయశక్తులా ప్రయత్నిస్తున్నప్పటికీ.. ప్రయోజనం లేకుండా పోతుంది. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్కు మరో పెద్ద షాక్ తగిలింది.
రాష్ట్ర సచివాలయం వల్లభ్భవన్లో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వెంటనే సమాచారం అందుకున్న దాదాపు 20 అగ్నిమాపక దళ వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ప్రమాద ఘటనపై సీఎం కూడా స్పందించారు.
విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో శిక్షణా విమానం కుప్పకూలిన ఘటన మధ్యప్రదేశ్ లోని గుణలో బుధవారంనాడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో మహిళా ట్రైనీ పైలట్ గాయపడింది. నీముచ్ నుంచి ధనకు విమానం ప్రయాణిస్తుండగా సాంకేతిక లోపం తలెత్తింది.
రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' మధ్యప్రదేశ్ లో కొనసాగుతోంది. యాత్ర సందర్భంగా మంగళవారంనాడు షాజపూర్ సిటీలో రాహుల్కు బీజేపీ కార్యకర్తలు వినూత్న రీతిలో స్వాగతం పలికారు. రాహుల్ సైతం హుందాగా వారి ఆహ్వానాన్ని స్వీకరిస్తూ కొద్దిసేపు వారితో ముచ్చటించి ఆ తర్వాత ముందుకు కదిలారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ప్రజలు ఫోన్ చూడాలి.. జై శ్రీరాం అనాలి. అలా చేస్తూ ఆకలితో చావండి. ప్రధాని మోదీకి కావాల్సింది ఇదే అని’ రాహుల్ గాంధీ అన్నారు. మధ్యప్రదేశ్ సారంగపూర్లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఈ కామెంట్స్ చేశారు.