Home » Mamata Banerjee
ట్రైనీ జూనియర్ డాక్టర్‌పై హత్యాచార ఘటన వెస్ట్ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. బాధితురాలి కుటుంబానికి మద్దతుగా ఆర్జీ కర్ ఆసుపత్రికి చెందిన పలువురు జూనియర్ డాక్టర్లు నిరాహార దీక్ష చేస్తున్నారు.
నేరం నేరమేనని, దీనికి కులం, మతం అనే తేడా లేదని మమతా బెనర్జీ అన్నారు. నేరస్థులపై కఠిన చర్యలు సుకోవాల్సిందేనన్నారు. అత్యాచార కేసుల్లో మీడియా ట్రయిల్స్ వల్ల దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందని అన్నారు.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) కీలక నిర్ణయం తీసుకుంది. జైలులో ఉన్న ఖైదీలకు సర్కార్ దసరా సందర్భంగా శుభవార్త చెప్పింది.
పశ్చిమబెంగాల్‌ను వరదలు ముంచెత్తుతుండటంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. వరద సాయం అందించడంలో కేంద్రం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందంటూ తప్పుపట్టారు.
కోల్‌కతా వారసత్వ ప్రతీకగా పేరొందిన ‘ట్రాము’ సర్వీసులను నిలిపివేయాలని బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది.
పశ్చిమబెంగాల్లోని జల్పాయ్గురి జిల్లాలో ఖాళీగా వెళ్తున్న గూడ్సురైలుకు చెందిన ఐదు బోగీలు మంగళవారం ఉదయం పట్టాల తప్పిన నేపథ్యంలో ఇండియన్ రైల్వేస్‌పై మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు.
డ్యామ్‌ల నుంచి దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డీవీసీ) నీరు విడుదల చేయడంతో పశ్చిమ బెంగాల్‌లోని పలు జిల్లాలకు వరద పోటెత్తింది. దీంతో ఆయా జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశంలో వెంటనే జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు.
వైద్యురాలిపై హత్యాచార ఘటన నేపథ్యంలో ఆందోళనకు దిగిన జూనియర్ డాక్టర్లు.. మమత బెనర్జీ ప్రభుత్వంతో జరిపిన చర్చలు దాదాపుగా ఫలప్రదమయ్యాయి. దాంతో 42 రోజుల పాటు సాగిన జూనియర్ డాక్టర్ల ఆందోళన శుక్రవారంతో ముగిశాయి. దీంతో నేటి నుంచి వారు విధులకు హాజరుకానున్నారు. అత్యవసర సేవలతోపాటు అవసరమైన సేవల్లో మాత్రమే వారు పాల్గొనున్నారు.
జార్ఖండ్‌కు నీరు వదిలే క్రమంలో పశ్చిమ బెంగాల్‌లోని పలు జల్లాలను వరద నీరు ముంచెత్తడంతో దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డీవీసీ) వ్యవహారించిన తీరుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. జార్ఖండ్‌ను రక్షించడం కోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ఈ విధంగా వ్యవహరించడం వల్లే వరద నీరు రాష్ట్రానికి పోటెత్తిందన్నారు.
2021 నుంచి ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ ప్రొ. సందీప్ ఘోష్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని హత్యాచారానికి గురైన ఆ కాలేజీ వైద్యురాలి తండ్రి వెల్లడించారు. ఆ నాడే ప్రొ. సందీప్ ఘోష్‌పై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కఠిన చర్యలు తీసుకుని ఉంటే.. ఈ రోజు తమ కుమార్తె బతికి ఉండేదన్నారు.