Home » Manmohan Singh
భారత మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఆరోగ్య సమస్యలను కూడా పట్టించుకోకుండా రాజ్యసభలో ఢిల్లీ సర్వీసుల బిల్లుపై చర్చ సందర్భంగా హాజరుకావడం అందరి దృష్టిని ఆకర్షించింది. 90 ఏళ్ల మన్మోహన్ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమంటూ కాంగ్రెస్ ఆయనపై ప్రశంసలు కురిపించగా, ఆరోగ్యం సరిగా లేని మాజీ ప్రధానిని అర్ధరాత్రి వరకూ పార్లమెంటులో వీల్‌చైర్‌పై కూర్చోబెట్టడం సిగ్గుచేటని బీజేపీ విమర్శించింది.
మణిపూర్‌లో ఘర్షణలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. కుకీ-నాగా, కుకీ-పెయిటీ, కుకీ-మెయిటీ తెగల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. ఫలితంగా వందలాది గ్రామాలు బూడిద కుప్పలవుతాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోవడంతోపాటు, వందలాది మంది గాయపడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి వీరు కొన్ని నెలల తరబడి హింసను కొనసాగిస్తూ ఉంటారు.
భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్(Manmohan Singh)కు బ్రిటన్‌లో జీవితకాల సాఫల్య గౌరవ పురస్కారాన్ని (Lifetime Achievement Honour) ప్రకటించడం జరిగింది.