Home » Manmohan Singh
మన్మోహన్‌కు ఆయన సొంత కారు 'మారుతి 800'తో ఎంతో అనుబంధం ఉండేదని ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ చీఫ్‌గా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి అసీమ్ అరుణ్ తెలిపారు.
ఆర్థికవేత్తగా, ప్రధానిగా అపార ప్రతిభాపాటవాలు కనబరిచిన మౌన మునిగా కూడా కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారు. అనేక సందర్భాల్లో ఆయన మౌనంగా ఉండిపోవడంపై ప్రతిపక్షాలు అనేక సార్లు ఆయన్ను టార్గెట్ చేసుకునేవి. దీనికి ఆయన 2018లో దీటైన సమాధానం ఇచ్చారు.
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Manmohan singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపట్ల ఏపీ మంత్రులు, ఎంపీ సంతాపం తెలియజేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించిన ఘనత మన్మోహన్ సింగ్ దే అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయనకు నివాళులు అర్పిస్తూ, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ సింగ్ సహకారం ఎప్పటికీ గుర్తుంటుందని సంఘ్ పేర్కొంది.
భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. 92 ఏళ్ల వయస్సులో ఆయన నిన్న రాత్రి 9:51 గంటలకు తుది శ్వాస విడిచారు. అయితే ఈ మాజీ ప్రధాని ప్రస్తుత ఆస్తులు ఎంత అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
న్యూఢిల్లీ: భారత దేశ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు శనివారం కేంద్రం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. కాగా శుక్రవారం ఉదయం 11గంటలకు కేంద్ర క్యాబినెట్ సమావేశం అవుతుంది. ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ మృతికి కేబినెట్ సంతాపం తెలపనుంది. అలాగే 7 రోజులు సంతాప దినాలుగా ప్రకటన చేసింది.
బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో రెండో రోజు ఆడేందుకు వచ్చిన టీమిండియా ఆటగాళ్లు చేతులకు నల్ల బ్యాండ్‌లు కట్టుకుని మైదానంలోకి వచ్చారు. అయితే వారంతా ఎందుకు అలా చేశారనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశ రాజకీయ యవనికపై ఒక శకం ముగిసింది.. కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థను ఆర్థిక మంత్రిగా గాడిలో పెట్టిన సంస్కరణల రూపశిల్పి.. ప్రధానిగా ప్రగతిపథంలో పరుగులు తీయించిన ఆర్థికవేత్త ఇక లేరు.. మౌనమే భాషగా ఉంటూనే రెండు పర్యాయాలు.. దేశాన్ని సమర్థంగా పరిపాలించిన రాజనీతిజ్ఞుడు.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు.
అనిశ్చితితో అతలాకుతలమై.. దివాలా అంచులకు చేరుకున్న భారత ఆర్థిక రంగానికి తన సంస్కరణలతో ఊతమిచ్చిన గొప్ప ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్..! పరిశ్రమల స్థాపనలో ‘లైసెన్స్ రాజ్’ సంస్కృతికి చరమగీతం పాడి.. సరళీకరణలతో పెట్టుబడులకు దోహదపడ్డ అపర చాణక్యుడాయన..!