Home » Medigadda Barrage
మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ నాణ్యతపై కేంద్ర బృందం విచారణ నిర్వహించింది. క్షేత్ర స్థాయిలో పనుల పరిశీలన కోసం నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ అధికారులు రంగంలోకి దిగారు. గత రెండు రోజులుగా రాష్ట్రంలో కేంద్ర అధికారుల బృందం పర్యటిస్తోంది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కుంగడంపై కేసు నమోదయ్యింది. మహదేవ్పూర్ పోలీసులు ఈ కేసు రిజిష్టర్ చేశారు. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పిల్లర్ కింద భారీ శబ్దం రావడంతో కుట్రకోణం ఉందన్న అనుమానంతో అధికారులు ఈ ఫిర్యాదు చేశారు.
మేడిగడ్డ బ్యారేజ్ 20వ పిల్లర్ కుంగటంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఇందుకుగల కారణాలను పరిశీలించడానికి కేంద్ర కమిటీని కేంద్రం నియమించింది.