మేడిగడ్డపై కేంద్రం డెడ్‌లైన్..
ABN , First Publish Date - 2023-10-28T09:47:01+05:30 IST
మేడిగడ్డపై కేంద్రం డెడ్‌లైన్ విధించింది. మేడిగడ్డపై కేంద్ర జలశక్తి శాఖ కమిటీ ప్రాజెక్టు నివేదికలు కోరింది. ప్రాజెక్టుకు సంబంధించిన 20 వేర్వేరు డాక్యుమెంట్లను కమిటీ కోరింది. వాటిలో 3 నివేదికలు, మరో నివేదికలో పాక్షికభాగం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది.
ఢిల్లీ : మేడిగడ్డపై కేంద్రం డెడ్‌లైన్ విధించింది. మేడిగడ్డపై కేంద్ర జలశక్తి శాఖ కమిటీ ప్రాజెక్టు నివేదికలు కోరింది. ప్రాజెక్టుకు సంబంధించిన 20 వేర్వేరు డాక్యుమెంట్లను కమిటీ కోరింది. వాటిలో 3 నివేదికలు, మరో నివేదికలో పాక్షికభాగం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. మిగతా నివేదికలను రేపటిలోగా అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కమిటీ లేఖ రాసింది. రేపటిలోగా ఇవ్వకుంటే ప్రాజెక్టుకు సంబంధించిన ఈ డాక్యుమెంట్లు లేనట్టుగా భావిస్తామని, ఆ మేరకు తదుపరి చర్యలు చేపడతామని వెల్లడించింది.
మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటు తర్వాత బ్యారేజీని పరిశీలించిన జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆధ్వర్యంలోని కేంద్రం బృందం వారంలోగా సమగ్ర నివేదిక ఇవ్వనుందని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ వర్గాలు ఇప్పటికే తెలిపాయి. ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ బృందం వివరణ అడిగిందని... వాటికి సమాధానాలు వచ్చాక నివేదిక సిద్ధమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి. బ్యారేజీని పరిశీలించి వచ్చిన తర్వాత ఈ బృందం ఓ ప్రాథమిక నివేదిక ఇచ్చిందని, అందులో కారణాలు ప్రస్తావించలేదని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.