Home » MLA
ప్రముఖ హీరోయిన్ రష్మికా మందన్నపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేపై మహిళా కమిషన్‌కు పలువురు ఫిర్యాదు చేశారు. ఈ విషయం ఇప్పుడు అటు సినీ, ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చానీయాంశమైంది. ఇందుకు సంభంధించిన వివరాలిలా ఉన్నాయి.
సభ మీ ఒక్కరి సొంతం కాదు’ అంటూ.. నిండు సభలో అసెంబ్లీ స్పీకర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రస్తుత సమావేశాలు ముగిసేదాకా ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రకటించారు
భారతీయ జనతా పార్టీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అటు బీజేపీ, ఇటు తనపై నాపై అసత్య ప్రచారాలు చేసి తన అక్కసు వెల్లగక్కుతున్నారని బీజేపీ సీనియర్ నేత కొప్పుల నర్సింహారెడ్డి పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరికీ తలొంచకుండా సక్రమ నిర్మాణాలు చేపట్టాలంటూ సంబంధిత అధికారుకు ఆయన సూచనలు చేశారు. అక్రమంగా చేపడుతున్న కట్టడాల వద్ద వసూళ్లకు మరిగి వత్తాసు పలుకుతున్నారంటూ ఆయన విమర్శించారు.
సర్వే నం. 261/2లోని 2.38 ఎకరాల విషయంలో యాజమాన్య హక్కులు నిరూపణకు పెద్దిరెడ్డి వద్ద ఎలాంటి దస్త్రాలు లేనందున నోటీసులు నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చిచెప్పింది.
నియోజకవర్గంలోని పురాత నమైన దేవాలయాల అభి వృద్ధితో పాటు గూగూడు ను పుణ్యక్షేత్రంగా, పర్యా ట క ప్రాంతంగా అభివృద్ధి చే యడానికి నిధులు కేటా యించాలని రాష్ట్ర దేవదా య శాఖ మంత్రి ఆనం రాం నారాయణరెడ్డికి ఎమ్మె ల్యే బండారు శ్రావణిశ్రీ విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే బుధవారం అసెంబ్లీ సమావేశాల అనంతరం మం త్రిని ఆయన కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు.
మండలంలోని బోగినేపల్లిలో నిధులు లేక ఆగిపోయిన లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయ నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డిని కోరారు. ఎమ్మెల్యే పరిటాల సునీత, బోగినేపల్లి గ్రామస్థులు బుధవారం విజయవాడలో దేవాదాయశాఖ మంత్రిని కలిశారు. భోగినేపల్లిలోని లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయ నిర్మాణానికి రూ.1. 60 కోట్లతో అంచనా వేశారన్నారు.
తెలంగాణ అసెంబ్లీలో హనీ ట్రాప్‌పై ఎమ్మెల్యేల మధ్య చర్చ జరిగింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను టార్గెట్‌గా చేసుకుని హనీట్రాప్ చేస్తున్నారని ఆరోపించారు. నేహాశర్మ పేరుతో పలువురు నేతలకు ఫోన్లు వస్తున్నాయని అన్నారు.
హంద్రీనీవాలో అంతర్భాగమైన 36సి (ఆవులదట్ల ఉపకాలువ) ప్యాకేజీ పనులు వెంటనే చేపట్టాలని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆయన మంగళవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. హంద్రీనీవా పనుల కోసం 2021 జూన 7న ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబరు 29 మేరకు రూ.6,124 కోట్ల పాలనా ఆమోదం పొందిందని అన్నారు. ఆ నిధులు అందుబాటులో ఉన్నందున తిరిగి పాలన, ఆర్థిక ఆమోదంతో ...
పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే తపసీ మండల్ సోమవారం తృణమూల్ కాంగ్రె్‌సలో చేరారు. ఆమె తూర్పు మిడ్నాపూర్ జిల్లా హల్దియా (ఎస్సీ) నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.