Home » Palnadu
పల్నాడు ఎస్పీ బింధుమాదవ్, తమ కుటుంబాలకు చుట్టరికం ఉందని చెబుతూ సాక్షిపత్రిక, మీడియా అసత్య కథనాలు రాస్తుందని నర్సారావు పేట కూటమి ఎంపీ అభ్యర్ధి లావు శ్రీకృష్ణ దేవరాయలు (Lavu Sri Krishna Devarayalu) అన్నారు. తన వైపు నుంచి ఏ సమాచారం కావాలన్న ఇస్తామని అన్ని విధాలా అధికారులకు సహకరిస్తానని చెప్పారు.
Andhrapradesh: ఎడ్యుకేషన్ అంటే మార్కులు ర్యాంకులే కాదని.. విజ్ఞాన సమూపార్జనే ఎడ్యుకేషన్ ముఖ్య ఉద్దేశమని సుప్రీంకోర్టు మాజీ ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. సోమవారం నరసరావుపేటలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌ను ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నరసరావుపేట లాంటి ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌ను ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు.
ఈ నెల 13న ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల బాధ్యులు కావడంతో సస్పెండ్ అయిన అధికారుల స్థానంలో కొత్తవారికి పోస్టింగులు వచ్చాయి.
Andhrapradesh: పల్నాడు అల్లర్లపై సిట్ అధికారులు అన్ని కోణాల్లో విచారించాలని టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు కోరారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... ఒక పత్రికలో ఎస్పీ బిందు మాధవ్ కుటుంబానికి తమకు బంధుత్వం ఉంది అని రాశారన్నారు. తమకు ఎస్పీ బిందు మాధవ్‌కు ఎటువంటి బంధుత్వం లేదని స్పష్టం చేశారు. తాను ఎప్పుడు ఎస్పీతో ఫోన్ కూడా మాట్లాడలేదన్నారు.
ఎన్నికల తర్వాత పల్నాడు జిల్లాలో పరిస్థితులపై ఆ జిల్లా కలెక్టర్ శ్రీ కేష్ బాలాజీ స్పందించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల తర్వాత జిల్లాలో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. జిల్లాలో అన్ని కేంద్రాలలో పోలింగ్ బాగా జరిగిందన్నారు. అక్కడక్కడా కొన్ని చోట్ల అల్లర్లు జరగటం బాధాకరమన్నారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Election 2024) పోలింగ్ ముగిసిన తర్వాత పలు జిల్లాల్లో అల్లర్లు జరిగాయి. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అల్లర్లను కట్టడి చేయడానికి సరైన చర్యలు తీసుకోలేదని ఎన్నికల సంఘం (Election Commission) పలువురిపై చర్యలు తీసుకుంది. ఈ విషయంపై మాజీ ఐఎఎస్ అధికారి, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ (Vijay Kumar) స్పందించారు. ఆదివారం విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై ఆయన మాట్లాడారు.
సార్వత్రిక ఎన్నికల తరువాత అల్లర్లు చెలరేగడం, మరికొన్ని రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల (AP Elections) ముందు.. ఆ తర్వాత జరిగిన అల్లర్లు ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 144 సెక్షన్ అమలు చేయడంతో పరిస్థితులు చక్కబడుతున్నాయి. మరోవైపు.. ఈ అల్లర్ల ఘటనపై విచారణ చేసేందుకు తాడిపత్రికి సిట్ అధికారుల బృందం విచ్చేసింది. శాంతిభద్రతల దృష్ట్యా రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దింపారు...
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) పోలింగ్ ముగిసిన తర్వాత పలు జిల్లాల్లో అల్లర్లు జరిగాయి. ఈ ఘటనలపై ఎన్నికల కమిషన్ (Election Commission) సీరియస్ అయింది. ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని ప్రశ్నించింది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జరిగిన గొడవలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలు రణరంగంగా మారిన పరిస్థితి. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై కేంద్ర ఎన్నికల కమిషన్ కన్నెర్రజేసి ఆయా జిల్లాల ఎస్పీలు, పలువురు పోలీసు ఉన్నతాధికారులపై వేటు వేసింది.