Share News

Gopireddy: పల్నాడు వైసీపీ కార్యాలయానికి అన్నీ అనుమతులు ఉన్నాయి: మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి

ABN , Publish Date - Jun 25 , 2024 | 09:36 PM

నరసరావుపేట(Narasaraopet)లో జిల్లా వైసీపీ కార్యాలయానికి(YSRCP Office) అనుమతులు లేవంటూ అధికారులు నోటీసులు ఇవ్వడంపై మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి (Former MLA Gopireddy Srinivasa Reddy) మండిపడ్డారు. 2014- 2019మధ్య టీడీపీ ప్రభుత్వంలో అనేక జిల్లాల్లో జీవో నంబర్ 27తెచ్చి టీడీపీ ఆఫీసుల నిర్మాణానికి ప్రభుత్వ స్థలాలను కేటాయించుకున్నారని గోపిరెడ్డి ఆరోపించారు.

Gopireddy: పల్నాడు వైసీపీ కార్యాలయానికి అన్నీ అనుమతులు ఉన్నాయి: మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి

పల్నాడు: నరసరావుపేట(Narasaraopet)లో జిల్లా వైసీపీ కార్యాలయానికి(YSRCP Office) అనుమతులు లేవంటూ అధికారులు నోటీసులు ఇవ్వడంపై మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి(Former MLA Gopireddy Srinivasa Reddy) మండిపడ్డారు. 2014- 2019మధ్య టీడీపీ ప్రభుత్వంలో అనేక జిల్లాల్లో జీవో నంబర్ 27తెచ్చి టీడీపీ ఆఫీసుల నిర్మాణానికి ప్రభుత్వ స్థలాలను కేటాయించుకున్నారని గోపిరెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నరసరావుపేటలో జిల్లా వైసీపీ కార్యాలయాన్ని పరిశీలించారు.


మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.." నరసరావుపేటలో నిర్మించిన జిల్లా వైసీపీ కార్యాలయానికి అన్నీ అనుమతులు ఉన్నాయి. ఇది అగ్రహారం భూమి అని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. లింగంగుంట్ల పంచాయతీలో ప్రత్యేక తీర్మానం పెట్టి ప్రభుత్వ చలానా కట్టి నిర్మాణం చేపట్టాం. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇవాళ (మంగళవారం) నోటీసులు ఇచ్చారు. టీడీపీ నేతలు ఇలానే ముందుకు వెళ్తే భవిష్యత్తులో లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తుతుంది. మా పార్టీ కార్యాలయం విషయంలో ఇక నుంచి ఏది ఉన్నా కోర్టు ద్వారా ముందుకు వెళ్తాం" అని చెప్పారు.

ఇవి కుడా చదవండి:

AP Politics: శాసనసభ నియమావళిపై ఎమ్మెల్యేలకు పవన్ కల్యాణ్ సూచనలు..

AP News: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ సన్నిహితురాలు శ్రీదేవిని హత్య చేసిన దుండగులు

Updated Date - Jun 25 , 2024 | 09:38 PM