Big Breaking: గడువు ముగిసింది.. నెక్ట్స్ ఏంటి? క్షణ క్షణం ఉత్కంఠ..!
ABN , Publish Date - Jun 06 , 2024 | 06:09 PM
జిల్లాలో పరిస్థితి క్షణ క్షణం ఉత్కంఠ భరితంగా మారుతోంది. పిన్నెల్లి వ్యవహారంలో ఏం జరుగుతుందోనని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఈవీఎం ధ్వంసం కేసు సహా పలు కేసుల్లో నిందితుడైన మాచెర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి..
పల్నాడు, జూన్ 06: జిల్లాలో పరిస్థితి క్షణ క్షణం ఉత్కంఠ భరితంగా మారుతోంది. పిన్నెల్లి వ్యవహారంలో ఏం జరుగుతుందోనని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఈవీఎం ధ్వంసం కేసు సహా పలు కేసుల్లో నిందితుడైన మాచెర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి హైకోర్టు ఇచ్చిన గడువు మరికాసేపట్లో ముగియనుంది. దీంతో పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి. హైకోర్టు ఆదేశాల మేరకు ఎస్పీ కార్యాలయంలో సంతకం చేసేందుకు వెళ్లారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయంలో మాచెర్ల నియోజకవర్గం పరిధిలో పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఈవీఎంను పగలగొట్టారు. దీంతో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసుతో పాటు.. మరో రెండు హత్యాయత్నం కేసులు కూడా నమోదయ్యాయి. ఈ కేసుల్లో అరెస్ట్ అవ్వకుండా ఉండేందుకు హైకోర్టును ఆశ్రయించారు పిన్నెల్లి. ఈ పిటిషన్ విచారించిన ధర్మాసనం.. ఈవీఎం ధ్వంసం కేసు సహా.. ఇతర కేసుల్లో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. జూన్ 6వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది. 6వ తేదీ వరకు ప్రతి రోజూ ఎస్పీ కార్యాలయం వెళ్లి సంతకం పెట్టాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో పిన్నెల్లికి హైకోర్టు ఇచ్చిన గడువు నేటితో ముగిసింది. దీంతో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని పోలీసులు ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. దీంతో పల్నాడు జిల్లాలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.