Home » Parliament
ఎమర్జెనీ సమయంలో మినహా మిగతా కాలమంతా పార్లమెంటు బాగానే పనిచేసిందని రాజ్యసభ చైర్పర్సన్ జగదీప్ ధన్ఖడ్ అన్నారు. పార్లమెంటు సభ్యులు దేశాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించారని కొనియాడారు.
మండీ నియోజకవర్గ ఎంపీ కంగనా రనౌత్ పార్లమెంటులో గురువారం తొలిసారిగా ప్రసంగించారు. తన నియోజకవర్గంలో, రాష్ట్రంలో అంతరించిపోతున్న కళారూపాలపై ఆవేదనా భరితప్రసంగం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె నెట్టింట పంచుకున్నారు.
న్యూఢిల్లీ: విజయవాడ విమానాశ్రయం విస్తరణ పనులపై పార్లమెంట్లో మచిలీపట్నం జనసేన ఎంపీ వల్లభనేని బాలసౌరి అడిగిన ప్రశ్నకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమాధానం ఇచ్చారు... విజయవాడ విమానాశ్రయం విస్తరణ పనులు 2020 జూన్లో ప్రారంభమయ్యాయని, మొత్తం రూ. 611 కోట్ల అంచనాలతో పనులు మొదలు పెట్టారన్నారు.
గాంధీ, బచ్చన్ కుటుంబాలకు చెందిన వ్యక్తులు ఒకరికొరు తారస పడితే అక్కడ సహజంగానే ఒకింత ఆసక్తికర వాతవారణం నెలకొంటుంది. అలాంటి అరుదైన ఘటనే బుధవారంనాడు పార్లమెంటు ఆవరణలో చేటుచేసుకుంది. కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ సోనియాగాంధీ, సమాజ్వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ ఒకరికొకరు ఎదురుపడి ఆప్యాయంగా పలకరించుకున్నారు.
పండించిన పంటలపై కనీస మద్దతు ధరకు హామీ ఇచ్చేలా చట్టం చేయాలంటూ రైతులు చిరకాల డిమాండ్ ఊపందుకోనుంది. దీనిపై విపక్షాలు ప్రైవేటు మెంబర్ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. కాంగ్రెస్ నేత, లోక్సభలో విపక్ష నాయకుడు రాహుల్ గాంధీని 12 మంది సభ్యుల రైతు ప్రతినిధుల బృందం బుధవారంనాడు కలుసుకుంది.
రాజ్యసభలో చైర్మన్ జగదీష్ ధన్కడ్, విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. సమావేశాల్లో భాగంగా ఖర్గే మాట్లాడుతుండగా చైర్మన్ స్థానంలో కూర్చొన్న జగదీష్ కల్పించుకున్నారు. మీ పుట్టిన రోజున ఆశీర్వాదం తీసుకున్నాను. నిన్న సభా సజావుగా జరిగిందని జగదీష్ గుర్తుచేశారు. ఆ తర్వాత ఖర్గే మాట్లాడుతూ.. సభలో సభ నాయకుడికి ఎలాంటి గౌరవం ఇస్తారో.. అదేవిధంగా ప్రతిపక్ష నేతకు గౌరవం దక్కాలని అభిప్రాయ పడ్డారు. సభలో అలా జరగడం లేదన్నారు.
Andhrapradesh: ఏపీలో పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి అయ్యేందుకు కేంద్రం భారీగా నిధులివ్వాలని ఎంపీ కేశినేని శివనాథ్ (MP Kesineni Shinath) కోరారు. సోమవారం లోక్సభలో రూల్ 377 కింద పొలవరం ప్రాజెక్ట్ నిధులపై ఎంపీ కేశినేని మాట్లాడారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం తగిన నిధులు విడుదల చేయాలని కోరారు. మిషన్ మోడ్ కింద పోలవరం ప్రాజెక్ట్ను తిరిగి ట్రాక్లోకి తీసుకువచ్చేందుకు ఏపీ ప్రభుత్వం...
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం రోజే 'నీట్' పేపర్ లీక్ అంశంపై అధికార పక్షాన్ని విపక్షాలు నిలదీశాయి. పేపర్ లీక్ అనేది తీవ్రమైన సమస్య అని, దీనికి విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాలని విపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. దీనికి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానమిస్తూ, ప్రభుత్వానికి ఎలాంటి దాపరికారాలు లేవని అన్నారు.
కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన తరువాత ఎన్డీయే సర్కార్ తొలి బడ్జెట్ మంగళవారం ప్రవేశపెట్టబోతోంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. పార్లమెంటు విలువైన సమయాన్ని ప్రతిపక్షాలు వృథా చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. మొదట ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరుగుతుంది. అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను సభలో ప్రవేశపెడతారు.