Home » Paytm
కేవైసీ నిబంధనలు ఉల్లంఘించిందనే కారణంతో పేటీఎంపై ఆర్బీఐ కఠిన ఆంక్షలు విధించింది. కొత్త కస్టమర్లను అనుమతించకుండా నిషేధం విధించింది. మార్చి 15 తర్వాత, కొత్త కస్టమర్ ఖాతాలు, ప్రీపెయిడ్ కార్డ్‌లు, Paytm వాలెట్‌లు, డిపాజిట్లు, క్రెడిట్ లావాదేవీలు లేదా టాప్-అప్‌లు పని చేయవు.
Paytm ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అలర్ట్ జారీ చేసింది. వీరంతా కూడా కొత్త ఫాస్ట్‌ట్యాగ్‌ని కొనుగోలు చేయాలని సూచించింది.
దేశంలో అత్యంత సంపన్న వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ సామాన్య ప్రజలకు చేరువయ్యేందుకు మరో ప్లాన్ వేశారు. త్వరలోనే రిలయన్స్ జియో పేమెంట్స్ సౌండ్‌బాక్స్ విభాగంలోకి కూడా ఎంట్రీ ఇస్తుంది. దీంతో ప్రధాన ప్రాంతాలతోపాటు పట్టణాలకు కూడా ఈ సేవలు అందించాలని ప్లాన్ చేస్తున్నారు.
పేటీఎంపై ఆర్బీఐ(RBI) నిషేధం విధించడంతో ఆ సంస్థ భారీ నష్టాలను చవిచూస్తోంది. 500 మిలియన్లకుపైగా డౌన్లోడ్లు కలిగిన పేటీఎం(Paytm)పై ఆంక్షలు పెరగడం, దాని షేర్లు పడిపోవడం, పేటీఎంలోని వివిధ కార్యకలాపాలు మార్చి నెలలో ఆగిపోతాయనే వార్తల నేపథ్యంలో కస్టమర్లు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు.
ఆర్బీఐ నిషేధం తరువాత పేటీఎం పేమెంట్స్‌కు (Paytm) మరో షాక్ తగలింది. ఫిన్‌టెక్ దిగ్గజ కంపెనీ అయిన పేటీఎం పేమెంట్స్‌కు కేంద్ర ఆర్థిక శాఖ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ - ఇండియా(FIU-IND) భారీ జరిమానా విధించింది. పేటీఎం మనీలాండరింగ్‌కు పాల్పడిందనే కారణంతో జరిమానా విధించినట్లు కేంద్రం తెలిపింది.
ఆర్థిక సంవత్సరంలో జరిగే మార్పులు మార్చి నెల నుంచి ప్రారంభం అవుతాయి. ఈ నెలలో ఐదు కీలక మార్పులు జరగనున్నాయి.
వాహనదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) గుడ్ న్యూస్ చెప్పనుందా. పీటీఐ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఫాస్టాగ్ కేవైసీ (KYC) అప్‌డేట్ గడువును ఎన్‌హెచ్ఏఐ పెంచబోతోంది. గతంలో ఫిబ్రవరి 29ని చివరి తేదీగా ప్రకటించగా.. వాహనదారుల వినతుల మేరకు పెంపు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆర్బీఐ నిబంధనలు పాటించకపోవడంతో నిషేధానికి గురైన పేటీఎం(Paytm Payments App)పేమెంట్స్ సంస్థ వేల కోట్ల నష్టాలు చవిచూస్తోంది. అదే సమయంలో వినియోగదారులు దూరమవుతుండటంతో దిద్దుబాటు చర్యలకు దిగింది.
పేటీఎం యూపీఐ సేవల విషయంలో సహాయం చేయాల్సిందిగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం కోరింది.
గత కొన్ని రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొన్న Paytm సంస్థకు మళ్లీ మంచి రోజులు వచ్చినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే గత రెండు సెషన్లలో పేటీఎం షేర్లు పుంజుకుంటున్నాయి.