Jio: పేమెంట్స్ సౌండ్‌బాక్స్ సెగ్మెంట్‌లోకి జియో..వీరికి గట్టి పోటీ
ABN , Publish Date - Mar 12 , 2024 | 01:53 PM
దేశంలో అత్యంత సంపన్న వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ సామాన్య ప్రజలకు చేరువయ్యేందుకు మరో ప్లాన్ వేశారు. త్వరలోనే రిలయన్స్ జియో పేమెంట్స్ సౌండ్‌బాక్స్ విభాగంలోకి కూడా ఎంట్రీ ఇస్తుంది. దీంతో ప్రధాన ప్రాంతాలతోపాటు పట్టణాలకు కూడా ఈ సేవలు అందించాలని ప్లాన్ చేస్తున్నారు.
దేశంలో అత్యంత సంపన్న వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ(mukesh ambani) సామాన్య ప్రజలకు చేరువయ్యేందుకు మరో ప్లాన్ వేశారు. ఇప్పటికే రిటైల్, దుస్తులు, టెలికాం, సినిమా సహా పలు రంగాల్లో ఈ సంస్థ ఎంట్రీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో త్వరలోనే రిలయన్స్ జియో పేమెంట్స్ సౌండ్‌బాక్స్(jio payments sound box) విభాగంలోకి కూడా ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే దీనిని పలు ప్రాంతాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించగా విజయవంతమయ్యాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాలతోపాటు పట్టణాల్లో కూడా వీటిని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే జియో పే(jio pay) యాప్ ద్వారా ఇది చేయనున్నట్లు తెలుస్తోంది.
దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ పేమెంట్స్(digital payments) విభాగంలో Reliance Jio చెల్లింపుల సౌండ్‌బాక్స్ ఎంట్రీ Paytm, PhonePe, Google Pay వంటి ఇతర సెగ్మెంట్ ప్లేయర్‌లకు గట్టి పోటీ ఇవ్వనుంది. పేటీఎంకు వ్యతిరేకంగా ఆర్బీఐ చర్యల తర్వాత ప్రజల్లో ఈ సంస్థపై అనుమానాలు పెరిగాయి. కానీ మార్చి 15 తర్వాత కూడా QR చెల్లింపు, సౌండ్‌బాక్స్ సేవలు పనిచేస్తాయని Paytm వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ఇప్పటికే స్పష్టం చేశారు. మార్చి 15 తర్వాత పేటీఎం పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
ఈ పరికరాన్ని కొనుగోలు చేసినందుకు వ్యాపారులకు ప్రత్యేక ఛార్జీ ఉంటుంది. దీంతోపాటు ఈ సేవను ఉపయోగించడానికి నెలవారీ అద్దె కూడా వసూలు చేస్తారు. QR కోడ్ ఆధారిత లావాదేవీలు ఫిన్‌టెక్ కంపెనీలకు POS లేదా పాయింట్ ఆఫ్ సేల్స్ డివైజ్‌ల కంటే ఇది రెట్టింపు ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. దీంతోపాటు వ్యాపారులకు(business mans) వారి లావాదేవీల ఆధారంగా రుణ సౌకర్యాలు పొందడంలో కూడా ఇవి సహాయపడతాయి. ప్రస్తుతం దేశంలో 2 కోట్ల మందికి పైగా వ్యాపారులు ఈ సౌండ్‌బాక్సులను ఉపయోగిస్తున్నారు. ఈ విభాగంలో Paytm మొదటి స్థానంలో ఉండగా, PhonePe రెండో స్థానంలో ఉంది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Viral Video: పాండ్యా డ్రెస్సింగ్ రూంలో ఒకటే పూజలు..ఇందుకేనా?