AP Budget 2025: ఏపీ శాసనసభలో 2025- 26 బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన మంత్రి పయ్యావుల
ABN , Publish Date - Feb 28 , 2025 | 10:32 AM
AP Budget 2025: 2025-26 రాష్ట్ర బడ్జెట్‌ను మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని సభ ముందు ఉంచారు.

అమరావతి, ఫిబ్రవరి 28: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavula Keshav) శుక్రవారం ఉదయం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ.. ఆర్థిక విధ్వంసకర పరిస్థితుల్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఎంతో క్లిష్టతరం. గత ప్రభుత్వం ప్రతీ శాఖలోనూ ఆర్థిక అరాచకం చేసిందని తెలిపారు. ఆయా శాఖల్లో లెక్కలను కొలిక్కి తీసుకొచ్చేందుకు చాలా సమయమే పట్టిందన్నారు. గత ప్రభుత్వ అరాచకాలను స్వయంగా నీతి ఆయోగ్ తన నివేదికలో వెల్లడించిందన్నారు. ఏపీ రుణ సామర్థ్యాన్ని సున్నాకు తీసుకువచ్చారని.. రాష్ట్రానికి అప్పు తీసుకునే పరిస్థితి లేదని నీతి ఆయోగ్ తెలిపిందన్నారు. దేశం మొత్తంలో అప్పు తీసుకునే శక్తి లేని ఏకైక రాష్ట్రంగా ఏపీ మిగిలిందన్నారు. ఈ పరిస్థితిల్లో బడ్జెట్ విషయంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) చెప్పిన మాటలే మార్గదర్శకంగా నిలిచాయన్నారు. అనుదాడిలో విధ్వసమైన హిరోషిమా నగరం లేచి నిలబడగా లేనిది ఆర్థిక విధ్వంసం జరిగిన ఏపీని తిరిగి నిలబెట్టలేమా అన్న సీఎం మాటల స్ఫూర్తితో ఈ బడ్జెట్ రూపొందిందని తెలిపారు.
బ్రాండ్ ఆంధ్రా పునరుత్తేజంతో..
గత ఏడాది ఎన్డీయే కూటమిపై ప్రజలు విశ్వాసం ఉంచి నవశకానికి నాందిపలికారన్నారు. రాష్ట్ర ప్రజలు ఈ అపూర్వ తీర్పుతో రాష్ట్రాన్ని సరైన మార్గంలో నడిపించి, వారి ఆకాంక్షలను నెరవేర్చే గురుతర బాధ్యతలను మా ప్రభుత్వానికి అప్పగించారన్నారు. ఏకపక్ష తీర్పు బ్రాండ్ ఆంధ్రా పునర్నిమానంలో నిబద్ధతకు పునరుత్తేజాన్ని ఇచ్చిందన్నారు. గత ప్రభుత్వ పాలనలో సామాన్యుల ప్రశాంతంగా బతకలేని భయానక, అభద్రత వాతావరణాన్ని సృష్టించిందన్నారు. గత పాలనంతా నిర్లక్ష్యం, విధ్వంసం, భావితరాల భవిష్యత్ నాశనంగా వర్ణించవచ్చు. రాష్ట్ర విభజన తర్వాత ప్రజలు ఎంతో శ్రమకోర్చి ముందడుగేశారు. విభజన తర్వాత ఎన్ని ఇబ్బందులు ఎదురైనా 2014-19 మధ్య కాలంలో రాష్ట్రం మునుపెన్నడూ చూడని రెండంకెల వృద్ధిని సాధించిందన్నారు.
2019లో పరిస్థితి ఇదీ...
2019లో వచ్చిన వైసీపీ సర్కార్ రాష్ట్ర పురోభివృద్ధికి అడ్డుకట్ట వేసింది. వైసీపీ చర్యలతో రాష్ట్ర అభివృద్ధి పురోగమనబాట నుంచి తిరోగమన బాట పట్టింది. ప్రజాస్వామ్య వ్యవస్థలు దెబ్బతిన్నాయి, పరిశ్రమలను రాష్ట్రం నుంచి తరిమేశారు, యువత దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిందన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ప్రజాసంక్షేమాన్ని మరిచి కక్ష సాధింపు రాజకీయాలకు తెరలేపారన్నారు. ప్రతిపక్షాల నోర్లు మూయించడంపైనే గత ప్రభుత్వం దృష్టిసారించదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ మార్పు సాధరణ విషయమని, గత ఐదేళ్ల అవినీతి, అసమర్థ పాలనలో ఎదుర్కున్న కష్టనష్టాల తర్వాత 2024లో ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారన్నారు.
93 శాతం సీట్లు, 57 శాతం ఓట్ల మెజార్టీతో గెలిపించారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక రాష్ట్ర పరిస్థితలను సమీక్షించి గత ప్రభుత్వ దుష్పరిపాలనను శ్వేతపత్రాల ద్వారా బయటపెట్టిందన్నారు. రాష్ట్రంలోని సంస్థలన్నీ నాశనమయ్యాయని, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని, అప్పులు భారీగా పెరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చ నాటికి రాష్ట్ర పరిస్థితి ఇదీ అని మంత్రి పయ్యావుల తెలిపారు.
ఇవి కూడా చదవండి...
Remand: పోసాని కృష్ణ మురళీకి రిమాండ్..
MLC Election: పోటెత్తిన టీచర్లు
Read Latest AP news And Telugu News