Home » Pemmasani Chandrasekhar
జులై 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీలతో పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఇవాళ సమావేశం కానున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో శనివారం మధ్యాహ్నం ఈ భేటీ జరగనుంది.
నకిలీ ఎరువులు, విత్తనాలు అమ్మే వారు అటువంటి పనులు మానుకోవాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandra Sekhar) అన్నారు. గుంటూరు జిల్లాలో వ్యవసాయ సన్నద్ధతపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఎన్డీయే సభ్యులమైన మనమందరం ఒకటేనని.. తనను కలవాలనుకుంటే ఎప్పుడైనా నిరభ్యంతరంగా కలవొచ్చని ప్రధాని మోదీ టీడీపీ ఎంపీలతో అన్నారు. అందరూ కలిసి వచ్చినా..
పార్లమెంట్ కొత్త భవనంలో 18వ లోక్సభ కొలువుదీరింది. ఈ భవనంలో లోక్సభ సభ్యుల ప్రమాణ స్వీకారం జరగడం ఇదే తొలిసారి. తొలుత ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు.
వైసీపీ ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేసి, ఖజానాను ఖాళీ చేసిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandra Sekhar) అన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని నిలిచిపోయిన అభివృద్ధి పనులపై సమీక్ష చేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడంతో నాలుగోసారి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార చేయడంతో అమెరికాలో సంబురాలు అంబురాన్నంటాయి.
టీడీపీ నేత, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయమంత్రిగా గురువారం బాధ్యతలు స్వీకరించారు. తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆయన కేబినెట్ సమావేశమైంది. న్యూఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో సోమవారం నిర్వహించిన ఈ సమావేశానికి 71 మంది మంత్రులు హాజరయ్యారు.
పోలవరం, రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేయడమే తమ ముందున్న ప్రథమ లక్ష్యమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) అన్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రజల కలల రాజధాని అమరావతి నిర్మాణం త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారధ్యంలో ముచ్చటగా మూడోసారి ‘మోదీ 3.0 ప్రభుత్వం’ కొలువుదీరింది. మూడవ సారి ప్రమాణ స్వీకారం చేసిన రెండవ ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకూ మూడు సార్లు ప్రధానిగా చేసిన రికార్డ్ కేవలం జవహర్లాల్ నెహ్రూదే. ఇప్పుడు మోదీ ఆ రికార్డును సమం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నరేంద్ర మోదీతో పాటు మంత్రి మండలిని ప్రమాణ స్వీకారం చేయించారు. మోదీతో పాటు మొత్తం 72 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు.