Home » Pemmasani Chandrasekhar
ఎన్నికల ముందు వరకు ఏపీలో చర్చంతా ఆయన గురించే.. నామినేషన్ వేసిన రోజు నుంచి ఎన్నికల పోలింగ్ పూర్తయ్యే వరకు గుంటూరు లోక్‌సభ స్థానం అందరి దృష్టిని ఆకర్షించింది. అమెరికాలో పెద్ద వైద్యుడిగా పేరు సంపాదించిన ఆయన ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
కేంద్ర మంత్రివర్గంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు ఆరు నుంచి ఏడుగురికి మంత్రి పదవులు లభించే అవకాశాలు ఉన్నాయని గత నాలుగైదు రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
గుంటూరు లోక్ సభ తెలుగుదేశం అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తన పార్లమెంట్ పరిధిలో విసృతంగా ప్రచారం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ అంటే తనకు అభిమానం అని, ఆయన మాదిరిగా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. పనిలో పనిగా సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
ఏపీలో అభ్యర్థులంతా ప్రచారంలో మునిగి తేలుతున్నారు. ఇక టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అయితే వినూత్న రీతిలో ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఏపీలో ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయో టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. నేడు ఆయన.. పొన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రతో కలిసి పెదకాకాని మండలం రెయిన్ ట్రీ అపార్ట్మెంట్ వాసులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
ఏబీఎన్ బిగ్ డిబేట్లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబుకే జగన్ చుక్కలు చూపిస్తున్నాడని రాధాకృష్ణ పేర్కొనగా.. తాను అన్నింటికీ ప్రిపేర్ అయ్యానంటూ పెమ్మసాని చంద్రశేఖర్ సమాధానం ఇచ్చారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ బిగ్ డిబేట్ జరిగింది. అన్నింటికి తెగి వచ్చానని, ప్రజా సేవ చేస్తానని చంద్రశేఖర్ అన్నారు.
గల్లా జయదేవ్‌ను పంపించినట్టు తనను పంపించడం కుదరదని గుంటూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిన పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. తాను అన్నింటికి తెగేసి రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు.
గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఎన్డీయే అభ్యర్థి, టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జగన్ షాక్ అవ్వాల్సిందే.. వార్ వన్ సైడ్ అయిపోతుందని గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. బిగ్ డిబేట్లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఆయన ఏం చెప్పారో ఈ వీడియోలో చూడండి..
టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు డైనమిక్ లీడర్ అని గుంటూరు ఎన్డీయే కూటమి అభ్యర్థి, టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ‘‘ చంద్రబాబు గారిని నేను కాలేజీ రోజుల నుంచి చూస్తూ ఎదిగాను. ఆయన పోరాటాలు చూశాను. తెలుగుజాతి వారు ఎక్కడ తిరుగుతున్నా అందులో చంద్రబాబు గారి పాత్ర ఉంది. ఆ విషయంలో ఆయనను ఎప్పుడూ ప్రశంసిస్తూనే ఉంటాను’’ అన్నారు.