Home » Pemmasani Chandrasekhar
నీతి, నిజాయితీతో కూడిన రాజకీయం చేయడానికే పాలిటిక్స్లోకి వచ్చానని తెలుగుదేశం పార్టీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. కొత్త తరం రాజకీయం ఏమిటో చూపిస్తానన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎటువంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని, అసభ్య పదజాలాన్ని ఉపయోగించలేదన్నారు. గతంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోశయ్య అసభ్యకర పదజాలాన్ని ఉపయోగించేవారని, తాను మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత.. ఆయన బూతులు మాట్లాడకుండా మార్చగలిగానని చెప్పారు.
ఏపీలో వైసీపీ అరాచక పాలన, తాజా రాజకీయ పరిణామాలు చూసిన తర్వాత ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని గుంటూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఏబీఎన్ బిగ్ డిబేట్లో మాట్లాడుతూ.. ఈ భూమిపై ఉన్న ప్రేమతోనే అమెరికా సిటిజన్ షిప్ తీసుకోలేదన్నారు. తాను టూరిస్ట్ వీసాలపై రాలేదన్నారు. తనకు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి వ్యాపారాలు లేవన్నారు.
గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఏబీఆన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో జరిగిన బిగ్ డిబేట్లో భాగంగా.. ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై అన్యాయంగా జరిగిన భౌతికదాడి ఘటనని ప్రస్తావించారు. తనకు ఎదురైన ఈ దారుణానికి తగిన జవాబు ఇచ్చి తీరుతారని..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కష్టపడే వారితో పోల్చలేమని గుంటూరు లోక్సభ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు.ఆ విధంగా పోల్చడం అవమానకరమన్నారు. ఇది ఒక రకమైన బూతు అని ఆయన అభివర్ణించారు.
ఆంధ్రప్రదేశ్లో రిచెస్ట్ సీఎం ఉన్నారు.. రిచెస్ట్ ఎంపీ అభ్యర్థి మీరేనని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ గుంటూరు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ను ప్రశ్నించారు. రిచెస్ట్ ఎంపీ అభ్యర్థినే కానీ.. కానీ తన లక్ష్యం వేరు అని సమాధానం ఇచ్చారు.
మెడిసిన్ చదివే వారికి ఇచ్చిన మెటీరియల్ వల్లే సంపాదించానని గుంటూరు తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ( Pemmasani Chandrashekar) ఏబీఎన్ ఆంధ్రజ్యోతి బిగ్ డిబేట్లో వివరించారు.
‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సంస్థల ఎండీ, ప్రముఖ జర్నలిస్టు వేమూరి రాధాకృష్ణ (RK) నేటి (బుధవారం) ‘బిగ్ డిబేట్’ చర్చలో గుంటూరు నుంచి ఎన్టీయే కూటమి తరపున నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆర్కే గారూ సంధిస్తున్న ఆసక్తికర ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తున్నారు. ఈ చర్చా కార్యక్రమాన్ని లైవ్లో వీక్షించండి.