Share News

ABN Big Debate: వైయస్ జగన్‌తో పోల్చడం.. బూతు

ABN , Publish Date - Apr 24 , 2024 | 08:18 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ మోహన్ రెడ్డిని కష్టపడే వారితో పోల్చలేమని గుంటూరు లోక్‌సభ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు.ఆ విధంగా పోల్చడం అవమానకరమన్నారు. ఇది ఒక రకమైన బూతు అని ఆయన అభివర్ణించారు.

ABN Big Debate: వైయస్ జగన్‌తో పోల్చడం.. బూతు

హైదరాబాద్, ఏప్రిల్ 24: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ మోహన్ రెడ్డిని కష్టపడే వారితో పోల్చలేమని గుంటూరు లోక్‌సభ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు.ఆ విధంగా పోల్చడం అవమానకరమన్నారు. ఇది ఒక రకమైన బూతు అని ఆయన అభివర్ణించారు.

AP High Court: ఎన్నికల వేళ.. వైసీపీకి మళ్లీ దెబ్బ

బుధవారం ఏబీయన్ ఆంధ్రజ్యోతిలో ఆర్కేతో జరిగిన బిగ్ డిటేట్‌లో (BIG Debate) ముఖ్య అతిథిగా పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అటు ఆర్కే, ఇటు పెమ్మసాని మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. దేశంలో నామినేషన్ వేసిన అత్యంత సంపన్న అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు.

KCR Bus yatra: మాజీ సీఎం కేసీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం

అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నారు. ఆయన దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా ఉన్నారని ఆర్కే ఈ సందర్బంగా ప్రస్తావించారు. ఇద్దరు ఇక్కడే అంటే.. గుంటూరు, గుంటూరు సమీపంలోనే ఉన్నారన్నారు. అయితే ఈ ఇద్దరి కంపారిజన్ కరెక్ట్ కాదని పెమ్మసాని చంద్రశేఖర్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.


ఆయనతో ఆర్కే సైతం ఏకీభవించారు. అంతలోనే మీ ఇద్దరు మార్గాలు వేరన్నారు. మీ అనుసరించిన మార్గాన్ని చెబితే చెప్పండంటూ ఆర్కే.. పెమ్మసాని కోర్టులోకి బాల్ వేశారు. దీంతో పెమ్మసాని చంద్రశేఖర్ తనదైన శైలిలో స్పందించారు. ఆ క్రమంలో తాను చిన్ననాటి నుంచి కష్టపడిన విధానాన్ని ఈ సందర్బంగా నెమరేసుకున్నారు.

Sam Pitroda Comments: బీజేపీ ఆరోపణలు.. స్పందించిన ఖర్గే

ఇంటర్మిడియట్‌లో రోజుకు 15 నుంచి 16 గంటలపాటు కష్టపడి చదివానని తెలిపారు. ఆ క్రమంలో తనకు 27 ర్యాంక్ వచ్చిందన్నారు. అనంతరం 5 ఏళ్లు మెడిసిన్ చేశానని వెల్లడించారు. ఆ తర్వాత మళ్లీ యూఎస్ వెళ్లడానికి చాలా కష్టపడి చదివానని వివరించారు. అక్కడ మళ్లీ మూడేళ్ల పీజీ కోర్స్ చేసే క్రమంలో బాగా కష్టపడి చదివానన్నారు.


అనంతరం బిజినెస్ పెట్టి అంచెలంచెలుగా ఎదిగినట్లు వెల్లడించారు. అంటే.. 2001లో స్టార్ట్ చేస్తే.. 2024లో ఈ పోజిషన్‌కు తాను వచ్చానన్నారు. అలాగే 2001కి ముందు 10 ఏళ్లు కష్టపడ్డి చదివానని.. దీంతో తాను 30 ఏళ్లు హార్డ్ వర్క్ చేస్తే... అలాగే 40 శాతం టాక్స్ కడితే.. తాను ఈ స్థాయికి వచ్చాన్నారు. అయితే వైయస్ జగన్ మోహ్ రెడ్డి ఏం చేశారు.. ఏం చేయలేదన్నారు. ఆయన రాగానే క్విడ్ ప్రోకో చేశారన్నారు. 2004లో ఆయన ఆస్తి కోటి రూపాయిలు ఉందని గుర్తు చేశారు.

Lok Sabha elections: ఎల్లుండే రెండో దశ పోలింగ్‌

క్విడ్ ప్రోక్ చేసుకొని దాని మీద వైయస్ జగన్ బిల్డ్ చేసుకుంటూ వచ్చారన్నారు. ఈ నేపథ్యంలో తనకు, వైయస్ జగన్‌కు కంప్లీట్ డిఫరెంట్ ఉందన్నారు. దీంతో కష్టపడి పని చేసేవారితో వైయస్ జగన్‌ను పోల్చేలేమని పెమ్మసాని చంద్రశేఖర్ కుండ బద్దలు కొట్టారు.

Read National News and Telugu News

Updated Date - Apr 24 , 2024 | 09:31 PM