Home » Pinnelli Brothers
ఈవీఎంల ధ్వంసం కేసులో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి(Rama Krishna Reddy Pinnelli) వ్యవహారంపై ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి, మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్(Dr. PV Ramesh) సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎం ఆంజనేయులు శుక్రవారం తెలిపారు..
మాచర్ల నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి(Pinnelli Ramakrishna Reddy) ఏపీ హైకోర్టులో(AP High Court) భారీ షాక్ తగిలింది. ఆయన కదలికలపై ఏపీ హైకోర్టు ఆంక్షలు విధించింది. పిన్నెల్లి మాచర్లకు వెళ్ల కూడదని ఆదేశాలు జారీ చేసింది.
ఈవీఎం బద్దలుకొట్టిన కేసులో మాచర్ల ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి దాగుడు మూతలు కొనసాగుతున్నాయి. ‘పరారీ’లో ఉన్న ఆయన ముందస్తు బెయిలు కోసం గురువారం హైకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనల అనంతరం కోర్టు ఆయనకు భారీ ఊరట కలిగించింది. ఫలితాలు వెలువడి, కోడ్ ముగిసేదాకా...
పోలింగ్ రోజు మాచర్ల వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన అకృత్యాలు ఒక్కొక్కటి ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. పిన్నెల్లి హింసాపర్వాన్ని పట్టించే మరో వీడియో తాజాగా వైరల్ అయింది. మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం కొత్తపుల్లారెడ్డిగూడెంలో 118, 119, 120 పోలింగ్ బూత్‌లలో కేతావత్ రేఖ్యానాయక్, హనుమంతునాయక్, బాణావత్ చిన ..
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు జరిగిన పోలింగ్, ఆ మరుసటి రోజు నుంచి ఏపీలో జరిగిన అల్లర్లు, అరాచకాలపై మరోసారి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా (DGP Harish Kumar Gupta)కు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) ఫిర్యాదు చేశారు.
ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పీవీప్యాట్ మెషీన్ ధ్వంసం కేసులో ఇరుక్కున్న మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి.. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ లంచ్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. మరికాసేపట్లో ఈ పిటిషన్‌ను ధర్మాసనం విచారించనుంది.
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని బాధితుడు, టీడీపీ నేత నంబూరు శేషగిరిరావు ఆందోళన వ్యక్తం చేశారు.
పోలింగ్ రోజు, ఆ తర్వాత మాచర్లలో అరాచకం సృష్టించిన వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పరారీలో ఉన్నారు. విదేశాలకు పారిపోయారా...
మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పాల్వయిగేట్ పోలింగ్ కేంద్రంలో వైసీపీ నాయకుడు, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను నేలకేసి కొట్టడంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఈ వ్యవహారంలో అతడిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ రాష్ట్ర ఉన్నతాధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.